మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కిష్టంపేట, కాసీపేట గ్రామాల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల ఓటర్ల జాబితాలో సుమారు 80 మంది మృతి చెందిన వారి పేర్లు ప్రత్యక్షమయ్యాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ జాబితాల్లో లేని ఈ పేర్లు స్థానిక సంస్థల ఎన్నికల జాబితాలోకి చేరడం గమనార్హం.