CM Revanth Reddy: స్క్రిప్ట్‌తో వస్తే చాలు సినిమా పూర్తి చేసుకొని వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి..
సినిమా అంటే రంగుల ప్రపంచమే కాదు. రాష్ట్ర అభివృద్ధిలో అదీ ఓ భాగం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో.. ఈ ముచ్చట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. సమ్మిట్‌లో ఎన్నో రంగాల నిపుణులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం... సినీ పరిశ్రమకు కూడా రెడ్ కార్పెట్ వేసింది. 2047విజన్ డాక్యుమెంట్‌ని జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి... సినిమా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో.. రెండ్రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ముగిసింది. రైతులు, మహిళలు, యువతీయువకుల అభ్యున్నతే లక్ష్యంగా.. 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి.. జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజన్ అందులో సినిమా పరిశ్రమకు కూడా అందులో ప్రధాన భూమికే కల్పించింది. సినీ ప్రముఖులతో సమావేశమైన రేవంత్‌రెడ్డి… చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అరవింద్, దిల్‌రాజు, సురేష్ బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా సహా పలువురు ప్రముఖులు.. ఈ సమ్మిట్‌లో తమ ఆలోచనలను పంచుకున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో సినిమా రంగానికి కూడా ప్రాధాన్యతనివ్వడం గర్వంగా ఉందన్నారు చిరంజీవి.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
విజన్ 2047లో సినిమాను కూడా ఒక కీలక భాగంగా చేసిన తెలంగాణ సర్కార్.. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని సినీ ప్రముఖులకు.. గ్లోబల్ సమ్మిట్ వేదికగా భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి శిక్షణ అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిల్మ్ సిటీగా మార్చేలా.. ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా… అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపి, ప్రపంచ స్థాయి స్టూడియోలను ఏర్పాటుకు అన్నివిధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..








