AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్య సాధనకు మూడు సూత్రాలు.. బిగ్ టార్గెట్‌తో రేవంత్ సర్కార్ దూకుడు..!

తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ చిన్నదేం కాదు. ముందుగా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని అందుకోవడమే తెలంగాణ ఫస్ట్ టార్గెట్. ఏదో ఒక రంగం మీదనో, ఒక నగరం మీదనో, ఒక జిల్లాపైనో ఫోకస్ పెడితే కుదరదు. సమగ్రమైన, సమీకృతమైన అభివృద్ధి ఉండాలి. అన్ని రంగాలను, అందరినీ కలుపుకొని వెళ్లాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

లక్ష్య సాధనకు మూడు సూత్రాలు.. బిగ్ టార్గెట్‌తో రేవంత్ సర్కార్ దూకుడు..!
Telangana Rising Target 2047
Balaraju Goud
|

Updated on: Dec 10, 2025 | 6:58 AM

Share

తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ చిన్నదేం కాదు. ముందుగా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని అందుకోవడమే తెలంగాణ ఫస్ట్ టార్గెట్. ఏదో ఒక రంగం మీదనో, ఒక నగరం మీదనో, ఒక జిల్లాపైనో ఫోకస్ పెడితే కుదరదు. సమగ్రమైన, సమీకృతమైన అభివృద్ధి ఉండాలి. అన్ని రంగాలను, అందరినీ కలుపుకొని వెళ్లాలి. అప్పుడే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దీని కోసమే ప్రభుత్వం మూడు అంచల వ్యూహాన్ని ప్రిపేర్‌ చేసింది.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం. దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆర్థిక వృద్ధిని సాధించడానికి మూడు మూల స్తంభాలను, మూడు ఉత్ప్రేరకాలను డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. లక్ష్య సాధనకు మూడు సూత్రాలు రూపొందించారు. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి… ఈ మూడు ఆర్ధిక వృద్ధికి మూల స్తంభాలని ప్రభుత్వం చెబుతోంది.

1. ఆర్థిక వృద్ధి: అంటే ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే ప్రధాన లక్ష్యం.

2. సమ్మిళిత అభివృద్ధి: దీని లక్ష్యం ఏంటంటే.. వృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందేలా చూడటం.

3. సుస్థిర అభివృద్ధి: అంటే అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం, 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.

ఇక మూడు ఉత్ప్రేరకాలు..

మొదటిదిః సాంకేతికత, ఆవిష్కరణ: అంటే పాలన, పరిశ్రమలు, సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.

రెండోదిః సమర్థవంతమైన ఆర్థిక వనరులు: లక్ష్యం– పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.

మూడోదిః సుపరిపాలన: పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.

ఇక మూడంచెల వ్యూహం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధిని సాధించేందుకు ఈ డాక్యుమెంట్ ఒక ప్రత్యేకమైన మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ప్రతిపాదించింది. అదే CURE, PURE, RARE. క్యూర్ అంటే.. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ.

ముందుగా క్యూర్ గురించి. ఇది పూర్తిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం రచించిన ప్రణాళిక. ఇప్పటికే, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. ఇదంతా కోర్ అర్బన్ రీజియన్ కింద లెక్క. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్లాన్స్ రూపొందించారు. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది.

ఇక ప్యూర్ గురించి.. ఔటర్ రింగ్ రోడ్, 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోన్. ఇది తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు చేశారు. అంటే.. ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు కేరాఫ్‌గా మారుస్తారు.

ఇక రేర్ గురించి. గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను పెంచుతారు. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెడతారు.

ఈ దార్శనికతను సాధించడానికి మొత్తం పది కీలక వ్యూహాలను డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. వీటిలో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి. పాలనా సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్ వంటి కార్యక్రమాలను బలోపేతం చేయాలని డాక్యుమెంట్ సిఫార్సు చేసింది. పెట్టుబడులను ఆకర్షించడానికి .. పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కూడా ప్రత్యేక వ్యూహాలను రూపొందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..
హెల్మెట్ వాడకంపై తిరుపతి పోలీస్ కొత్త ప్లాన్... ఏమిటో తెలుసా..!
హెల్మెట్ వాడకంపై తిరుపతి పోలీస్ కొత్త ప్లాన్... ఏమిటో తెలుసా..!
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్.. ఉత్కంఠ పోరులో ABNపై TV9 అద్భుత విజయం
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్.. ఉత్కంఠ పోరులో ABNపై TV9 అద్భుత విజయం