08 December 2025
మందు తాగే అలవాటు ఉంది.. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.. హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో వరుస విజయాలతో గోల్డెన్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది సంయుక్త మీనన్. అయినప్పటికీ ఈ అమ్మడుకు కొన్నాళ్లుగా ఆశించినస్థాయిలో ఆఫర్స్ రాలేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. తనకు మద్యం సేవించే అలవాటు ఉందని ఆమె చెప్పడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అయితే తాను రోజూ మద్యం తీసుకోనని.. కేవలం ఎక్కువగా ఒత్తిడి లేదా ఆందోళనగా అనిపించినప్పుడు మాత్రమే అల్కహాల్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తానని అన్నారు. ఈ అలవాటు నుంచి దూరమయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని.. అయినప్పటికీ కంట్రోల్ కావడం లేదని అన్నారు.
ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత సార్, విరూపాక్ష, బింబిసార వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి అఖండ 2 చిత్రంలో నటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఈ మూవీ వాయిదా పడింది.
ప్రస్తుతం తెలుగులో స్వయంభు, నారి నారి నడుమ మురారి, పూరి, విజయ్ సేతుపతి సినిమాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్