ఖమ్మం పాత బస్టాండ్లో మొబైల్ ఫోన్ల దొంగతనాలు కలకలం సృష్టించాయి. ఇద్దరు దొంగలు కర్చీఫ్లు, కవర్లను అడ్డుపెట్టుకొని బస్సు ఎక్కే ప్రయాణికుల ఫోన్లను సులభంగా అపహరించారు. నిమిషాల వ్యవధిలో పది మంది ఫోన్లు చోరీకి గురైనట్లు సీసీటీవీలో రికార్డైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.