Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (December 10, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి రాజ యోగం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 10, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడి వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. లాభ స్థానంలో ఉన్న రాహువు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా అండదండలనిస్తాడు. ఏ రంగానికి చెందినవారైనా ఆశిం చిన పురోగతి ఉంటుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సప్తమ స్థానంలో ఉన్న శుక్ర, బుధ, రవులు, లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాలు కూడా లాభిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడి పంచమ స్థాన స్థితి, ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల రాజ యోగం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో ఉన్న శని, పంచమ స్థానంలో ఉన్న రవి, శుక్రులు వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని అదృష్టాన్ని కలగజేస్తాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యయ స్థానంలో ఉన్న గురువు వల్ల వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఉచిత సహాయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో ఉన్న గురువు, చతుర్థ స్థానంలో ఉన్న రవి, శుక్రుల వల్ల వృత్తి, ఉద్యోగాలు, వ్యాపా రాలు నిలకడగా ఉండడం, ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావడం జరుగుతుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అష్టమ శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. మీ దగ్గర సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్య సమస్యలుంటాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దశమ స్థానంలో ఉన్న గురువు, తృతీయ స్థానంలో ఉన్న రవి, శుక్రుల వల్ల శ్రమ తక్కువ ఆదా యం ఎక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. షష్ట స్థానంలో ఉన్న రాహువు వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి. వ్యయ స్థానంలో ఉన్న కేతువు వల్ల ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శని, కుజ గ్రహాల పరస్పర వీక్షణ వల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అధికారులతో, తండ్రితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల కొన్ని ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో, రవి, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్న కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మంచి యోగం పట్టే అవకాశం ఉంది. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు, సొంత రాశిలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. సంపద కలిసి వస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు బాగా అభివృద్ధి చెందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. మిత్రులకు అండగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): లాభ స్థానంలో ఉన్న రవి, కుజ, బుధ గ్రహాల కారణంగా ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. తృతీయంలో ఉన్న రాశ్యధిపతి శని వల్ల ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది. ఇంటాబయటా బాగా ఒత్తిడి ఉండడం, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉండడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో బాగా కలిసి వస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): లాభ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శుక్ర, రవి గ్రహాల వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి, మిత్రుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి కలిసి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): దశమ స్థానంలో కుజుడు, భాగ్య స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ప్రస్తుతానికి విశ్రాంతి తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది.



