Kubera Yoga: గురువు అతి వక్రం.. ఆ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది..!
డిసెంబర్ 10 నుండి ఫిబ్రవరి 10 వరకు మిథున రాశిలో గురువు అతి వక్రం చెందుతాడు. ఈ కారణంగా గురువు శుభ ఫలితాలను వేగంగా, తీవ్రంగా ఇస్తాడు. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం, ధన యోగం పడుతుంది. ఈ కాలంలో చేసే చిన్న ప్రయత్నాలకూ భారీ ఫలితాలుంటాయి, ఆర్థిక వృద్ధి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

Kubera Yoga
ఈ నెల(డిసెంబర్) 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 10 వరకు మిథున రాశిలో గురువు అతి వక్రం చెందడం జరుగుతోంది. అతి వక్రం వల్ల గురు గ్రహంలో వేగం పెరుగుతుంది. దీని వల్ల తాను ఇచ్చే శుభ ఫలితాలను తీవ్రతరం, వేగవంతం చేయడం జరుగుతుంది. ఈ రకమైన బలం వల్ల గురువు వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అతిగా, అతి వేగంగా శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ఈ రాశుల వారు ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా అనేక రెట్లు ఎక్కువగా ఫలితాలు కలుగుతాయి. రవికి షష్ట, సప్తమ, అష్టమ స్థానాల్లో గురువు సంచారం చేయడాన్నే అతి వక్రం అంటారు.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న గురువు అతి వక్రం చెందడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండు పర్యాయాలు ధన యోగం పట్టే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన ఆర్థిక ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలనివ్వడం ప్రారంభం అవుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అదనపు ఆదాయానికి, ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి.
- మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు అతి వక్రం చెందడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. ఇంటా బయటా ఆకస్మిక మార్పులకు బాగా అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పూర్తిగా మారిపోతాయి. అధికార యోగం పడుతుంది. ఇల్లు లేక ఊరు మారే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న గురువు మరింత చురుకుగా, క్రియాశీలంగా మారడం వల్ల ఈ రాశివారు ఉన్నత పదవుల కోసం, భారీ జీతభత్యాల కోసం ఉద్యోగం మారే అవకాశం ఉంది. విదేశీ సంపాదన యోగం పట్టే సూచనలు కూడా ఉన్నాయి. అనుకోకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. జీవితంలో హఠాత్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊహించని అదృష్టాలను పండిస్తాయి.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువుకు బాగా బలం పెరగడం వల్ల కలలో కూడా ఊహించని విధంగా ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వీరికి తప్పకుండా వీరికి విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి కోలుకోవడం జరుగుతుంది.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో అతి వక్రం చెందడం వల్ల ఈ రాశివారి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం మొదలవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు అతి వక్రం చెందడం వల్ల ఈ రాశివారు కొత్త రంగంలో ప్రవేశించి ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల్లో సంపాదనను మదుపు చేసి లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది.



