Adhikara Yoga: రవి, కుజుల యుతి.. ఆ రాశుల వారికి అధికార, రాజయోగాలు పక్కా..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కుజ గ్రహాలు అధికార యోగానికి సంబంధించిన యోగాలు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశుల వారు తప్పకుండా కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ప్రభుత్వంలోనూ, రాజకీయంగానూ ఊహించని ప్రాబల్యం, ప్రాబల్యం కలుగుతాయి. ఈ నెల(డిసెంబర్) 16 నుంచి జనవరి 14 వరకు రవి, కుజులు ధనూ రాశిలో కలిసి సంచారం చేయడం జరుగుతోంది. ఈ యుతి వల్ల కొన్ని రాశులవారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు, అధికార యోగాలు కలిగే అవకాశం ఉంది. వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో కూడా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులవారికి ఇటువంటి ఉజ్వల భవిష్యత్తు సిద్ధంగా ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6