Black Thread: కాలికి నల్ల దారం కడుతున్నారా?.. జాగ్రత్త.. కష్టాలను కొని తెచ్చుకున్నట్టే!
చెడు దృష్టి, ఎవరి దిష్టి, తగలకుండా ఉండాలని ఈ మధ్య కాలంలో చాలా మంది కాలికి నల్లదారాన్ని కట్టుకోవడం మీరు చూసే ఉంటారు. అంతెందుకు మీకు కూడా కట్టుకొనే ఉంటారు. కానీ అలా కట్టుకోవడం కరెక్టేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? కానీ ఇలా నల్లదారం కాలికి కట్టుకోవడం అస్సలు మంచిది కాదంట. ఎందుకో తెలుసుకుందాం పదండి.

దుష్టశక్తులను దూరంగా ఉంచడానికి, తమపై ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండేందుకు చాలా మంది తమ కాలికి నల్ల దారాలను ధరిస్తారు.నిజానికి ఇది ఏళ్లనాటి నుంచి కొనసాగుతున్న ఆచారం.మొదటల్లో వీటిని చిన్న పిల్లలకు ఎక్కువగా ధరించేవారు. కానీ కాలక్రమేనా అందరూ వీటిని కాలికి కట్టుకోవడం ప్రారంభించారు. నలుపు రంగు శని, రాహు గ్రహాలతో ముడిపడి ఉంటుంది.ఈ దారాన్ని కట్టుకోవడం వల్ల ఈ గ్రహాల చెడు ప్రభావాల నుండి అది తమను రక్షిస్తుందని , ప్రతికూల శక్తిని అదుపులో ఉంచుతుందని వారు నమ్ముతారు.
అయితే పాదాలకు నల్ల దారం ధరించడం అశుభమని,దురదృష్టమని కొందరు భావిస్తున్నారు.ఎందుకుంటే ఇది మనల్ని చెడు దృష్టి నుంచి రక్షిస్తుందని..అందుకని దీనిని ఎప్పుడూ పాదాలకు ధరించకూడదని చెబుతున్నారు.కొందరు ఫ్యాషన్ కోసం పాదాలకు ఈ నల్ల దారాన్ని కట్టుకుంటున్నారని..కానీ దాని వల్లే వారు అనవసరమైన సమస్యలు ఎదుర్కోవసి వస్తుందని చెబుతున్నారు.నల్ల దారాన్ని కాలికి కట్టుకోవడం వల్ల మంచికి బదులుగా ప్రతికూల శక్తి పెరుగుతుంది. మీ పాదాల దగ్గర శనిని కట్టుకోవడం వల్ల అది లక్ష్మీ రాకకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ నల్లదారి ప్రయోజనాలు పొందేందుకు దానిని సరైన స్థానంలో కట్టుకోవడం ముఖ్యం.
నల్ల దారాన్ని ఎవరు, ఎక్కడ కట్టుకోవడం ఉత్తమం
అయితే ఈ నల్ల దారాన్ని ఎవరు, ఎక్కడ కట్టుకోవడం మంచిది అనే విషయానికి వస్తే అమ్మాయిలు అయితే నల్ల దారాన్ని తమ ఎడమ చేతికి కట్టుకోవాలని.. పురుషులు అయితే కుడి చేతికి కట్టుకోవడం శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు.శని బలహీనంగా ఉన్నవారు నల్లదారాన్ని నడుముకు కట్టుకోవాలని సూచించారు. మీరు మీ చేతికి నల్ల దారం ధరిస్తే, దానితో పాటు ఏదైనా ఇతర రంగు దారాన్ని కూడా కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్ల దారం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మీ జీవితంలోని సమస్యలను కూడా తగ్గిస్తుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




