AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea: ఉదయం లేదా సాయంత్రం.. గ్రీన్‌టీ ఏటైంలో తాగడం ఉత్తమం

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందుకే టీ, కాఫీ వంటివి తాగడం మానేసి అందరూ గ్రీన్‌టీ, లెమన్‌టీ తాగడం స్టార్ట్‌ చేశారు. దీంతో గ్రీన్ టీ తాగడం ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. జనాలు దీనివైపు ఎక్కువగా మొగ్గుచూపేందుకు ప్రధాన కారణం ఏంటంటే దీన్ని తాగడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్‌ ఏంటంటే.. దీన్ని ఉదయం లేదా సాయంత్రం ఏటైంలో తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలను పొందవచ్చని. కాబట్టి గ్రీన్‌ టీ ఏటైంలో తాగడం ఉత్తమమో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Dec 09, 2025 | 9:39 PM

Share
గ్రీన్‌టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.మీరు బరువు తగ్గాలని లేదా కొవ్వును కరిగించాలని ప్లాన్ చేస్తుంటే, పగటిపూట గ్రీన్ టీ తాగడం చాలా ఉత్తమం. అలాగే మీరేదైనా పనిచేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు.. నిద్రపోయినట్టు అనిపిస్తే.. ఒక కప్పు గ్రీన్‌ టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ నిద్రను దూరం చేయడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

1 / 5
 ఉదయం గ్రీన్‌టీ తాగడం వల్ల ప్రయోజనం: మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్‌టీ తాగడం వల్ల ఆరోజు ఎంతో తాజాగా ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్, ఎల్-థియనిన్ మన మెదడుకు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే పొద్దునే జీర్ణవ్యవస్థ కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ తాగడం వల్ల మన జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.

2 / 5
సాయంత్రం తాగితే ఏమవుతుంది?:కొంతమందికి సాయంత్రం వేళల్లో వేడిగా ఏదైనా తాగే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత కడుపు నిండిపోయినట్లు లేదా బరువుగా అనిపిస్తే, గ్రీన్ టీ తాగడం మంచిది. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ మీకు నిద్రపోవడం కష్టంగా ఉంటే లేదా కెఫిన్‌కు సర్దుబాటు చేసుకోలేకపోతే, సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట గ్రీన్ టీకి కాస్త దూరంగా ఉండండి.

3 / 5
పర్ఫెక్ట్ టీ ఎలా తయారు చేయాలి?: గ్రీన్‌టీని తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం వేడినీటిలో ఒక చెంచా ఆకులు లేదా టీ బ్యాగ్ వేసి, స్టవ్ ఆపివేసి, రెండు నిమిషాలు మూతపెట్టండి.ఆది బాగా మరిగిన తర్వాత దాన్ని వడకట్టి.. ఒక కప్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత దాన్ని ఆస్వాధించండి.

4 / 5
మీరు రోజుకు ఎన్ని కప్పులు తాగవచ్చు?:మితిమీరితే అమృతం కూడా విషం అన్నట్టే.. గ్రీన్‌టీ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. రోజులో 3 నుంచి 5కప్పుల గ్రీన్‌టీ మాత్రమే తాగాలి. దీని వల్ల గుండె సమస్యలు, షుగర్ వంటి వ్యాధుల నుంచి ఉపసమనం పొందవచ్చు. అలా కాదని 8 కప్పుల కంటే ఎక్కువ తాగితే నిద్రలేమి వంటి సమస్యల బారీన పడవచ్చు. అయితే గ్రీన్‌టీని ఏ సమయంలో తాగాలనే విషయానికొస్తే.. అది మన అవసరాలను భట్టి మారుతుంది.

5 / 5