AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Sunitha: ఇది చూసి నేను షాక్‌కు గురయ్యా.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సింగర్‌ సునీత

Singer Sunitha: సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న సింగర్‌ సునీత.. ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆమె..

Singer Sunitha: ఇది చూసి నేను షాక్‌కు గురయ్యా.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సింగర్‌ సునీత
Singer Sunitha
Subhash Goud
|

Updated on: May 12, 2021 | 11:26 PM

Share

Singer Sunitha: సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న సింగర్‌ సునీత.. ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్‌ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనా కాలంలో సునీత రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో లైఫ్‌ సెషన్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చటిస్తున్నారు. దీంతో ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు సునీత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా వారు అడిగిన పాటలను పాడుతూ ఉత్సాహ పరుస్తున్నారు.

సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై ఆమె స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె లైవ్‌లో ఆమె స్పందించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీంతో లాక్‌డౌన్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరు నిత్యవసరాల కోసం, ఇతర సామాగ్రి కోసం పరుగులు పెట్టారు. అయితే ఇక్కడ నన్ను బాధించిన విషయం ఏంటంటే.. వైన్స్‌ షాపుల ముందు కూడా జనాలు బారులు తీరడం. ఇది నేను ఉహించలేదు. ఇది చాలా బాధకరం. లాక్‌డౌన్‌ కారణంగా సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాపడ్డా. కానీ ఈ సంఘటనను చూసి షాక్‌కు గురయ్యా అంటూ ఆమె లైవ్‌లో చెప్పుకొచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో అందరికి కొంతసేపు రిలీఫ్‌ కలిగించేందుకు సునీత తనవంతుగా ప్రతి రోజు అరగంట పాటు లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతూ ఉత్సాహపరుస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి అరగంట పాటు నెటిజన్లు కోరిన పాటలు పాడుతూ ఉపశమనం కలిగిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Hrithik Roshan: కన్‌ఫ్యూజ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్.. మొద‌లు ఏ సినిమా.. త‌ర్వాత ఏ సినిమా

Corona in Tollywood: టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి