Corona in Tollywood: టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి

టాలీవుడ్ సీనియ‌ర్​ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తనువు చాలించారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన...

Corona in Tollywood: టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి
Ks Chandrasekhar Death
Follow us

| Edited By: Subhash Goud

Updated on: May 12, 2021 | 11:23 PM

టాలీవుడ్ సీనియ‌ర్​ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ తనువు చాలించారు. గత కొద్దిరోజుల నుంచి కరోనాతో బాధపడుతున్న ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. కె.ఎస్‌.చంద్రశేఖర్ స్వ‌స్థ‌లం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం. సినిమాల కంటే ముందు ఈయన రేడియోలో పని చేసారు. 1990లో ఆల్‌ ఇండియా రేడియోలో గ్రేడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరి విశాఖపట్నం వాసులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య ‘బంట్రోతు భార్య’ చిత్రంతో నేపథ్య గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు చంద్రశేఖర్. ఆ తర్వాత లెజెండరీ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్‌ అసోసియేట్‌గా వ‌ర్క్ చేసి.. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. యమకింకరుడు, ఆణిముత్యం , భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి హిట్ చిత్రాలకు చంద్రశేఖర్​ మ్యూజిక్ అందించారు. ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈయన దగ్గరే శిష్యరికం చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వుల‌పై ప‌గ‌బ‌ట్టింది. సామాన్యుల‌తో పాటు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఎంద‌రో చిత్ర సీమ‌కు చెందిన‌ ప్రముఖులు ఈ వైర‌స్ బారిన‌ప‌డి ప్రాణాలు విడిచారు. తాజాగా న‌టుడు, సినీ జ‌ర్న‌లిస్ట్ టీ.ఎన్.ఆర్ కూడా క‌రోనాతో ఈ లోకాన్ని వీడారు. మ‌రోవైపు సెకండ్ వేవ్ వీర‌విహారం చేస్తుండ‌టంతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసే జూనియ‌ర్ ఆర్టిస్టులు, సినీ కార్మికులు విప‌రీత‌మైన క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు.

Also Read: ఇద్ద‌రు లేడీ సూప‌ర్ స్టార్లు.. విజ‌య్ సేతుప‌తి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు!

పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బన్నీ… నెక్స్ట్ సినిమా కూడా అదే లెవల్ లో…

Latest Articles
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు