Hrithik Roshan: కన్‌ఫ్యూజ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్.. మొద‌లు ఏ సినిమా.. త‌ర్వాత ఏ సినిమా

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాను కన్‌ఫ్యూజ్‌ అవ్వటమే కాదు.. అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేసేస్తున్నారు. ప్రజెంట్‌ సిద్ధార్ధ్‌ ఆనంద్‌తో ఫైటర్ సినిమా...

Hrithik Roshan:   కన్‌ఫ్యూజ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్.. మొద‌లు ఏ సినిమా.. త‌ర్వాత ఏ సినిమా
Hrithik-Roshan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2021 | 10:12 PM

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాను కన్‌ఫ్యూజ్‌ అవ్వటమే కాదు.. అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేసేస్తున్నారు. ప్రజెంట్‌ సిద్ధార్ధ్‌ ఆనంద్‌తో ఫైటర్ సినిమా చేస్తున్న ఈ హ్యండ్సమ్‌ హంక్‌.. నెక్ట్స్‌ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. క్రిష్ 4 టీమ్‌ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉంది. అయినా మరిన్ని ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పేస్తున్నారు ఈ గ్రీకు వీరుడు. కానీ వీటిల్లో ఏది సెట్స్ మీదకు వెళుతుంది అన్న విషయం మాత్రం తేల్చటం లేదు. ఆ మధ్య ఓటీటీ ప్రాజెక్ట్‌కు హృతిక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్న న్యూస్‌ తెగ వైరల్ అయ్యింది. హాలీవుడ్ సూపర్ హిట్ నైట్‌ మేనేజర్‌కు ఇండియన్ వర్షన్‌లో హృతిక్ హీరోగా నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ ఓకే అనుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిసి విక్రమ్ వేదా రీమేక్‌ను తెర మీదకు తీసుకువచ్చారు. సైఫ్‌తో కలిసి ఈ సౌత్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు హృతిక్‌.

కానీ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారట. ఓటీటీ ప్రాజెక్ట్‌ చేస్తే పేమెంట్‌తో పాటు పాన్ వరల్డ్ రేంజ్‌ కూడా వస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే విక్రమ్‌ వేదాను పక్కన పెట్టి నైట్‌ మేనేజర్‌ను టేకప్‌ చేసేందుకు రెడీ అవుతున్నారన్నది లేటెస్ట్ అప్‌డేట్‌. ఇలా వెంట వెంటనే మనసు మార్చుకోవటంతో ఫ్యాన్స్‌ కూడా కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు.

Also Read: ఇద్ద‌రు లేడీ సూప‌ర్ స్టార్లు.. విజ‌య్ సేతుప‌తి హీరో.. క్రేజీ కాంబో.. ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు!

టాలీవుడ్ ను వెంటాడుతున్న క‌రోనా విషాదాలు.. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మృతి