AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Suchitra: మాజీ భర్త గే అంటూ కామెంట్స్.. క్షమించాలని కోరిన సింగర్.. వీడియో రిలీజ్..

ఇటీవల కొద్ది రోజుల క్రితం పలువురు సినీతారలతోపాటు మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్ తోపాటు హీరో ధనుష్ తోపాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. వీరిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

Singer Suchitra: మాజీ భర్త గే అంటూ కామెంట్స్.. క్షమించాలని కోరిన సింగర్.. వీడియో రిలీజ్..
Suchitra Singer
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2024 | 3:28 PM

Share

కోలీవుడ్ సింగర్ సుచిత్ర ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సుచీ లీక్స్ తర్వాత సైలెంట్ అయిన సుచిత్ర.. కొద్ది రోజుల క్రితం తిరిగి యాక్టివ్ అయ్యింది. ఎప్పుడూ ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తుంది. గతంలో ఇండస్ట్రీలో సుచీలీక్స్ పేరుతో నటీనటుల పర్సనల్ విషయాలపై సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఇటీవల కొద్ది రోజుల క్రితం పలువురు సినీతారలతోపాటు మాజీ భర్త నటుడు, స్టాండప్ కమెడియన్ కార్తీక్ కుమార్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్ తోపాటు హీరో ధనుష్ తోపాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సైతం గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై మాజీ భర్త కార్తీక్ కుమార్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. వీరిద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

తాజాగా తన మాజీ భర్తకు క్షమాపణలు చెప్పింది సింగర్ సుచిత్ర. అలాగే ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అతడిని గే అని పిలిచినందుకు బాధపడతున్నాను.. అతడి కెరీర్ నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు. అందుకే క్షమాపణలు కోరుతున్నాను..కార్తీక్ ఫిర్యాదు చేయడం వల్లే పోలీసుల నుంచి నాకు తరచుగా కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అందుకే తాను చేసిన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది. కార్తీక్ మంచి వ్యక్తి అని.. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు వీడియోలో వెల్లడించింది. అయితే ఆ వీడియోను కొద్దిసేపటికే డిలీట్ చేసింది.

తన మాజీ భర్త కార్తీక్ కు క్షమాపణలను చెబుతూ ఈమెయిల్ పంపుతానని తెలిపింది. ఇకపై అతడి కెరీర్ కు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని.. అలాగే అన్ని వదిలేసి మానసిక ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుచిత్ర చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.