Actor Vinakayan: డూప్‏గా నటించి విలనయ్యాడు.. జైలర్ మూవీ విలన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..

తమదైన నటనతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్స్ కూడా ఉన్నారు. అందులో వినయకన్ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ జైలర్ మూవీ విలన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో అంతగా విలనిజం పండించి గుర్తింపు తెచ్చుకున్నాడు

Actor Vinakayan: డూప్‏గా నటించి విలనయ్యాడు.. జైలర్ మూవీ విలన్ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే..
Vinakayan
Follow us

|

Updated on: Aug 13, 2024 | 8:19 PM

సాధారణంగా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించే నటీనటులకు మాత్రమే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే కమెడియన్స్, సహాయ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఇక సినిమాల్లో అన్ని పాత్రలకంటే ఎక్కువ పవర్ ఫుల్ రోల్ విలన్. ప్రతినాయకుడు ఎంత భయంకరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. అందుకే తెలుగు సినిమాల్లో విలన్ అంటే మాస్, రగ్గడ్ లుక్ లో కనిపిస్తుంటారు. గుబురు గడ్డం, పెద్ద జుట్టుతో రగ్గడ్, మాస్ లుక్ లో భయంకరంగా కనిపిస్తుంటారు. తమదైన నటనతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్స్ కూడా ఉన్నారు. అందులో వినయకన్ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ జైలర్ మూవీ విలన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో అంతగా విలనిజం పండించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

వినయకన్.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వినయకన్. 1973లో కేరళలోని ఎర్నాకులంలో జన్మించాడు. కేవలం విలన్ మాత్రమే కాదు.. సింగర్, కంపోజర్, కొరియోగ్రాఫర్ కూడా. ఇండస్ట్రీలోని పలు రంగాల్లో మల్టీ టాలెంటెడ్ గా రాణించాడు. సినిమాల్లోకి రాకమందు వినయకన్ డ్యాన్సర్. బ్లాక్ మెర్క్యరీ అనే డాన్స్ గ్రూపు నిర్వహించాడు. నిజానికి మైకేల్ జాక్సన్ ను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేస్తూ అలరించేవాడు. 1995లో మలయాళంలో తెరకెక్కించిన మాంత్రికం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో మైకేల్ జాక్సన్ డూప్ గా అతిథి పాత్రలో నటించాడు. ఆ తర్వాత 2001లో ఓనమన్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు.

2006లో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అసాధ్యుడు సినిమాలో విలన్ గా నటించాడు. తమిళంలో విశాల్ నటించిన పొగరు సినిమాలో నటించాడు. సౌత్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించిన వినయకన్ జైలర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.