Tollywood: మనసును మైమరపించే పాటల రచయిత.. ఈ జంట ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల రేర్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చిన్ననాటి ఫోటోస్.. కెరీర్ ప్రారంభంలోని పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే తారల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ఫేమస్ వ్యక్తి వెడ్డింగ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ?

Tollywood: మనసును మైమరపించే పాటల రచయిత.. ఈ జంట ఎవరో గుర్తుపట్టారా..?
Actors
Follow us

|

Updated on: Aug 13, 2024 | 8:16 PM

ఇటీవల కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల రేర్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చిన్ననాటి ఫోటోస్.. కెరీర్ ప్రారంభంలోని పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే తారల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ఫేమస్ వ్యక్తి వెడ్డింగ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ? అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్. అలాగే ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అద్భుతమైన పాటలతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పాటల రచయిత. సింపుల్ గా కనిపిస్తున్నా.. శ్రోతల హృదయాలను హత్తుకునే ఎన్నో పాటలను రచించారు. ఇంతకీ అతను ఎవరంటే.. సినీ పాటల రచయిత భాస్కర భట్ల. ఆయన పూర్తి పేరు భాస్కరభట్ల రవికుమార్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తెలుగు సినీ పరిశ్రమలోని ఫేమస్ పాటల రచయితలలో భాస్కర భట్ల ఒకరు.

పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించిన భాస్కర భట్ల.. దాదాపు పదేళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మంచి మక్కువ ఉన్న భాస్కరభట్ల.. ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. కెరీర్ ప్రారంభంలోనే కవిత్వాలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి పాటల రచయితగా మారారు. 2000ల నందమూరి బాలకృష్అణ హీరోగా దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన గొప్పింటి అల్లుడు చిత్రంలో గీత రచయితగా అడుగుపెట్టారు. ఆ తర్వాత చక్రి ప్రోత్సాహం ద్వారా సినీరంగంలో రాణించారు. ఇద్దరు కలిసి దాదాపు 65 చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఎక్కువగా పాటలు రాశారు.

ఇప్పటివరకు దాదాపు 300కి పైగా సినిమాలకు పాటలు రాశారు. రవితేజ నటించిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలో రాసిన మళ్లీ కుయవే గువ్వ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలను మైమరపిస్తుంది. ఆ తర్వాత పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయసు, బొమ్మరిల్లు సినిమాలో బొమ్మను గీస్తే, జల్సాలోని గాల్లో తేలినట్టుందే వంటి సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. 2013లో మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలో సర్ ఒస్తారా పాటకు ఉత్తమ గీత రచయితగా SIIMA అవార్డ్ గెలుచుకున్నారు. 1974 జూన్ 5వ తేదీన శ్రీకాకుళంలో గార మండలం బూరవెల్లి గ్రామంలో జన్మించారు. బీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.