Samantha: సమంతకు కూడా పెళ్లి ప్రపోజల్.. కన్విన్స్‌ అయ్యిన సామ్ సమాధానం.!

Samantha: సమంతకు కూడా పెళ్లి ప్రపోజల్.. కన్విన్స్‌ అయ్యిన సామ్ సమాధానం.!

Anil kumar poka

|

Updated on: Aug 13, 2024 | 7:36 PM

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవలే శోభిత ధూళిపాళతో అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. కింగ్ నాగార్జున ఎంగేజ్ మెంట్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసి.. కాబోయే జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. త్వరలోనే నాగ చైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు. నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ కూడా హోరెత్తిపోయాయి.

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నాడు. ఇటీవలే శోభిత ధూళిపాళతో అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. కింగ్ నాగార్జున ఎంగేజ్ మెంట్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసి.. కాబోయే జంటను ఆశీర్వదించాలని అందరినీ కోరారు. త్వరలోనే నాగ చైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు. నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ కూడా హోరెత్తిపోయాయి. అందులో ఒక వీడియో మాత్రం సమంత మనసును దోచింది. ముఖేష్ అనే అభిమాని సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక రీల్ చేసి పోస్ట్ చేశారు. ‘సమంతా.. నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు నేనున్నాను. నువ్వు నేను క‌లిస్తే ఒక మంచి జంట అవుతాం. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవ‌డానికి రెడీగా ఉన్నాను. నాకొక 2 ఇయ‌ర్స్ టైం ఇవ్వు దండిగా డ‌బ్బులు సంపాదించి నీ ద‌గ్గరికి వ‌స్తాను. అప్పటివ‌రకు నా గుర్తుగా ఈ పువ్వు అదే నా హార్ట్‌ను ఉంచుకో’ అని అందులో చెప్పుకొచ్చాడు సదరు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్.

ముఖేష్ రీల్ కు సమంత కూడా వెంటనే స్పందించింది. ‘నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను.. రీల్ కన్నా నీ బ్యాగ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను బాగా ఆకట్టుకుంది’ అని కామెంట్ చేసింది. దీంతో ముఖేష్ ఆనందానికి హద్దుల్లేవు. సమంతను ట్యాగ్ చేస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ‘సమంత ఇచ్చిన రిప్లై నా రోజును పూర్తిగా మార్చేసింది. సమంతకు వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను కూడా ఒకడిని. అదే ఒక్కరే అభిమాని అంటే అది నేనే. సమంతకు ఎవరూ అభిమానులు లేరంటే భూమి మీద నేను కూడా లేనట్లే’ అని సామ్ పై ప్రేమను కురిపించాడు ముశేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.