Mahesh Babu: మహేష్ బాబు సినిమా షూటింగ్‏లో వారితో కలిసి లేడీ డైరెక్టర్ ధర్నా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

మురారి సినిమా రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా ఇంటర్య్వూలు ఇచ్చారు. ఇక మురారి సినిమా రీరిలీజ్ కు ముందు నుంచి డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మురారి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని, సందేహాలను నెటిజన్స్ అడుగుతుండగా..

Mahesh Babu: మహేష్ బాబు సినిమా షూటింగ్‏లో వారితో కలిసి లేడీ డైరెక్టర్ ధర్నా.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..
Mahesh Babu
Follow us

|

Updated on: Aug 14, 2024 | 3:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే వన్ ఆఫ్ ది క్లాసిక్ హిట్ మూవీ మురారి. ఇటీవలే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. మురారి సినిమా రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా ఇంటర్య్వూలు ఇచ్చారు. ఇక మురారి సినిమా రీరిలీజ్ కు ముందు నుంచి డైరెక్టర్ కృష్ణవంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మురారి సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని, సందేహాలను నెటిజన్స్ అడుగుతుండగా.. కృష్ణవంశీ నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో మురారి షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి ఓ నెటిజన్ అడగ్గా.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు కృష్ణవంశీ. నిజానికి మురారి సినిమాకు వర్షం డైరెక్టర్ శోభన్, డైరెక్టర్ నందిని రెడ్డి, లక్ష్యం డైరెక్టర్ శ్రీవాస్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. మురారి షూటింగ్ సమయంలో తమ డైరెక్టర్ డిపార్మెంట్ అంతా ఒకరోజు ధర్నా చేశామని.. షూటింగ్ లో ముఖ్యమైన రోజే అలా చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ కృష్ణవంశీని అడగ్గా.. అసలు విషయం చెప్పారు. నందిని రెడ్డి, టీమ్ మురారి సినిమాలో చేసిన దాని గురించి ప్రశ్నిస్తూ మీకు కోపం వచ్చిందా అని అడగ్గా.. కృష్ణవంశీ రియాక్ట్ అవుతూ.. “కోపం కాదు సర్.. పనిలో రెస్పాన్సబిలిటీగా లేకపోతే నేను తీసుకోలేను. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫ్యూచర్ డైరెక్టర్స్.. వాళ్లు ఏదైనా చేయగలిగేలా, చేసేలా ఉండాలి. వాళ్లు కిడ్స్ లాంటి వాళ్లు అప్పుడు. 12 నుంచి 14 గంటల పనిచేసిన తర్వాత ఫ్రస్టేషన్ వస్తుంది. అది నేను అర్థం చేసుకోగలు. అందుకే నాకు కోపం రాలేదు. ఆ తర్వాత కూడా వాళ్లతో కలిసి పనిచేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల మురారి సినిమా రీరిలీజ్ థియేటర్లలో మహేష్ అభిమానులు చేసిన రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అలనాటి రామచంద్రుడు సాంగ్ ప్లే అవుతుండగా ఓ జంట ఈ పాటను రీక్రియేట్ చేశారు. అయితే మన సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించవద్దు అంటూ అసహనం వ్యక్తం చేశారు డైరెక్టర్ కృష్ణవంశీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహేష్ బాబు సినిమా షూటింగ్‏లో లేడీ డైరెక్టర్స్ ధర్నా..
మహేష్ బాబు సినిమా షూటింగ్‏లో లేడీ డైరెక్టర్స్ ధర్నా..
రైతు రుణమాఫీపై అనుమానాలు.. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామంటున్న..
రైతు రుణమాఫీపై అనుమానాలు.. గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామంటున్న..
ఆ టీవీఎస్ స్కూటర్‌కు నయా లుక్.. సూపర్ కలర్స్‌తో మతిపోతుందిగా..!
ఆ టీవీఎస్ స్కూటర్‌కు నయా లుక్.. సూపర్ కలర్స్‌తో మతిపోతుందిగా..!
తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే ఉత్కంఠ.. లిస్టులో పార్టీ అగ్రనేతలు
తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే ఉత్కంఠ.. లిస్టులో పార్టీ అగ్రనేతలు
మీరు కొన్న ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ నిండుగా ఉంటోందా?
మీరు కొన్న ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ నిండుగా ఉంటోందా?
ఆవుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పాల్గొన్న స్థానికులు
ఆవుకు ఘనంగా జన్మదిన వేడుకలు.. పాల్గొన్న స్థానికులు
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
హీరో ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. రూ.32 వేల వరకు తగ్గింపు
హీరో ఈవీ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. రూ.32 వేల వరకు తగ్గింపు
జాంటీ రోడ్స్‌ కన్నా డబుల్ డేంజర్‌.. క్యాచ్ కోసం ఏకంగా
జాంటీ రోడ్స్‌ కన్నా డబుల్ డేంజర్‌.. క్యాచ్ కోసం ఏకంగా
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!
ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!