AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఇప్పటికీ గ్లామర్ క్వీన్..

సెలబ్రెటీస్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన తారలకు సంబంధించిన చిన్ననాటి పిక్స్, అరుదైన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. నటీనటులకు, అభిమానులకు మధ్య గ్యాప్ కూడా తగ్గిపోవడంతో తారల రేర్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న నాట్యమయూరిని గుర్తుపట్టారా..? తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 200

Tollywood: ఈ నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఇప్పటికీ గ్లామర్ క్వీన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2024 | 3:43 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ తెగ వైరలవుతుంది. సెలబ్రెటీస్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన తారలకు సంబంధించిన చిన్ననాటి పిక్స్, అరుదైన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. నటీనటులకు, అభిమానులకు మధ్య గ్యాప్ కూడా తగ్గిపోవడంతో తారల రేర్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న నాట్యమయూరిని గుర్తుపట్టారా..? తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు సహాయ పాత్రలలో నటిస్తుంది. ఆమె ఎవరంటే.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.

బాహుబలి చిత్రాలలో శివకామిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన దక్షిణ భారత నటి రమ్యకృష్ణ. సౌత్ ఇండియన్ సినిమాకి ఆమె తిరుగులేని స్టార్ ప్రెజెన్స్. తన 13 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. వెల్లై మనసు సినిమాతో తమిళం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1990 నుంచి 2000.. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో అనేక సంచలన సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రాజమాత శివగామి పాత్రను ఎవరూ ఊహించని విధంగా రమ్య చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

12 జూన్ 2003న తెలుగు దర్శకుడు కృష్ణ వంశీని వివాహం చేసుకున్నారు రమ్యకృష్ణ. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. తమిళనాడుకు చెందిన రమ్య పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడింది. సెకండ్ ఇన్నింగ్స్ లో అనే సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. బాహుబలి సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది అవార్డ్, ఫిలింఫేర్, సైమా, ఐఫా అవార్డ్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.