Jyothi Rai: బిగ్‏బాస్‏లోకి జగతి మేడమ్.. క్లారిటీ ఇచ్చిన జ్యోతిరాయ్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్..

బిగ్‏బాస్ సందడి మొదలవుతుంది. ఇప్పటికే తెలుగులో7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. దీంతో అటు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట వైరలవుతుంది. యాంకర్స్, నటీనటులు, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్‏బాస్ లోకి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Jyothi Rai: బిగ్‏బాస్‏లోకి జగతి మేడమ్.. క్లారిటీ ఇచ్చిన జ్యోతిరాయ్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్..
Jyothi Rai
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 08, 2024 | 7:39 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి మొదలవుతుంది. ఇప్పటికే తెలుగులో7 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో సీజన్ 8 స్టార్ట్ కానుంది. దీంతో అటు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట వైరలవుతుంది. యాంకర్స్, నటీనటులు, సీరియల్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8లోకి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగులోకి కాదు.. కన్నడ బిగ్‏బాస్ సీజన్ 11లోకి అడుగుపెట్టనుందట. కన్నడలో ఇప్పటివరకు 10 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. 11వ సీజన్‌లో ఎవరు పాల్గొంటారనేది హౌస్‌లో ఆసక్తిని కలిగించింది. ప్రముఖ నటి జ్యోతి రాయ్‌కి ఈసారి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తున్నాయి.. కానీ ఆ అవకాశాన్ని అంగీకరించలేదని స్వయంగా చెప్పుకొచ్చింది.

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది జ్యోతిరాయ్. ఇందులో జగతి మేడమ్ పాత్రలో సహజనటనతో మెప్పించింది. చీరకట్టులో హుందగా కనిపించి తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత అటు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో అలరిస్తుంది. బిగ్ బాస్ గత సీజన్లలో చాలా మంది టీవీ సెలబ్రిటీలకు అవకాశం వచ్చింది. ఈసారి కూడా సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారినే నామినేట్ చేస్తున్నారు. ఆ నేప‌థ్యంలో ఇప్పుడు జ్యోతిరాయ్‌కి కూడా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ విషయాన్ని జ్యోతి రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. ‘కన్నడ బిగ్ బాస్ షోలో నేను పోటీ చేసే అవకాశాల గురించి చాలా మంది అడుగుతున్నారు. బిగ్ బాస్ టీమ్ నుండి నాకు ఆఫర్ వచ్చినప్పుడు, నేను దానిని గౌరవంగా తిరస్కరించాను. గతంలో అంగీకరించిన పనికి సంబంధించిన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ అవకాశం ఇచ్చినందుకు, నా అభిమానుల మద్దతుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. నిత్యం ఎన్నో రకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!