Brahmamudi, August 8th Episode: కట్టు బట్టలతో బయటకు వెళ్లిపోయిన కళ్యాణ్, అప్పూలు.. కావ్యపై నిందలు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూకి తాళి కట్టేస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత ఎందుకురా ఇలాంటి పని చేశావు. రాజ్ ఏంటి నువ్వు చేసిన పని? నాకు ఇష్టం లేదని తెలిసి ఎందుకు తాళి కట్టావు? నీకు తల్లీ, తండ్రి అంటే లెక్క లేదా? ఎందుకురా ఇంత పని చేశావు? అని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. అమ్మా నేను ఏం చేశానో నాకు తెలుసు. నువ్వు ఒప్పుకోవని తెలిసే.. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధమైంది అప్పూ. తన జీవితం అంతా ఆ బాధ మోయడానికి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూకి తాళి కట్టేస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత ఎందుకురా ఇలాంటి పని చేశావు. రాజ్ ఏంటి నువ్వు చేసిన పని? నాకు ఇష్టం లేదని తెలిసి ఎందుకు తాళి కట్టావు? నీకు తల్లీ, తండ్రి అంటే లెక్క లేదా? ఎందుకురా ఇంత పని చేశావు? అని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. అమ్మా నేను ఏం చేశానో నాకు తెలుసు. నువ్వు ఒప్పుకోవని తెలిసే.. తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవడానికి సిద్ధమైంది అప్పూ. తన జీవితం అంతా ఆ బాధ మోయడానికి వెనకాడ లేదు. కావ్య వదినతో సహా అందరూ నన్ను దూరం పెట్టారు. కానీ చివరికి ఆ దేవుడు ఇలా బ్రహ్మముడి వేశాడని కళ్యాణ్ అంటాడు. కవి ఏంటిది? ఎందుకు ఇలా చేశావు? అని అప్పూ అంటుంది. బ్రో నీ మీద జాలితో నేను తాళి కట్టలేదు. ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. కానీ నేను అనామిక ఆకర్షణలో పడి.. నిన్ను స్నేహితురాలిగానే చూశాను. అనామిక వెళ్లిపోయిన తర్వాత కూడా అనామిక ఒక్క నిమిషం కూడా జ్ఞాపకం రాలేదు. నువ్వు ఏం అయిపోతావో.. నీ జీవితం గురించే ఆలోచించాను. దాన్ని ప్రేమ అంటారని మా అన్నయ్య స్పష్టం చేస్తేనే తప్ప నాకు తెలియ రాలేదు. అందుకే ధైర్యంగా నీ మెడలో తాళి కట్టాను. నిన్ను ప్రేమించాను కాబట్టే.. పెళ్లి చేసుకున్నానని కళ్యాణ్ అంటాడు.
రుద్రాణికి సుభాష్ వార్నింగ్..
నేను ఒప్పుకోను.. ఈ పెళ్లి అస్సలు నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకుండా ఇది నా ఇంటికి కోడలిగా ఎలా వస్తుంది? ఈ తాళి ఇప్పుడే తెంచి పడేస్తానని ధాన్య లక్ష్మి అప్పూ మెడలో తాళి తెంచేస్తుండగా.. ప్రకాశం గట్టిగా ఒక చెంప దెబ్బ ఇస్తాడు. ఇదే చెంప దెబ్బ అప్పూ మీద నింద వేసినప్పుడు కొట్టి ఉంటే.. ఈ రోజు ఈ కుటుంబం ఇంత మంది ముందు తల దించుకునే పరిస్థితి వచ్చేది కాదు. నా కొడుకు కోర్టులో అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదని ప్రకాశం అంటాడు. అదేంటి? కన్న తల్లికి ఆ మాత్రం హక్కు లేదా? అని రుద్రాణి అంటే.. నోర్ముయ్.. ఆడపడుచు హోదా ఇచ్చాం కదా అని.. ఇంట్లో ఉండి చిచ్చు పెడతావా? నీ వల్ల ధాన్య లక్ష్మి కూడా చెడిపోయింది. నిన్నూ నీ కొడుకుని కట్టు బట్టలతో గెంటేస్తానని సుభాష్ అంటాడు.
ఇంట్లోంచి నేను బయటకు వెళ్లిపోతాం..
ఏంటి కవి గారూ ఇది? నేను మిమ్మల్ని నమ్మాను. నా దగ్గర నిజం చెప్పకుండా ఎందుకు మోసం చేశారు? ఏది నిజమని కళ్యాణ్‌ని నిలదీస్తుంది కావ్య. నేను ఏం చేసినా సపోర్ట్ చేసే మీరు నన్ను ఇప్పుడు తప్పు పడుతున్నారా? అని కళ్యాణ్ అంటాడు. ఇప్పటివరకూ జనాలు నమ్మిన నిందే నిజం అవుతుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టే.. అనామికకు విడాకులు ఇచ్చి అప్పూని పెళ్లి చేసుకున్నారని అనుకుంటారు. పైగా మీ అమ్మ గారు, రుద్రాణిలు జీవితాంతం మమ్మల్ని నిందిస్తూనే ఉంటారు. అసలు ఇది కోడలిగా ఇంట్లో అడుగు పెడితే.. దాన్ని మన: శాంతిగా బ్రతకనిస్తారా? కాపురం చేసుకోనిస్తారా? అని కావ్య అడుగుతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా.. ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతామని కళ్యాణ్ అంటాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు.
మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు..
రేయ్ కళ్యాణ్.. ఏం మాట్లాడుతున్నావ్? అప్పూతో పెళ్లి చేస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు అనుకున్నా.. కానీ ఇలా బయటకు వెళ్తారని కాదని రాజ్ అంటాడు. రేయ్ అయినా ఇది ఉమ్మడి ఆస్తిరా.. మన ఇంట్లో ఉండే హక్కు ఉందని రాజ్ సర్ది చెప్తాడు. నాన్నా కళ్యాణ్.. అప్పూని కోడలిగా మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. నేను ఒప్పుకుంటాను అని అపర్ణ అంటుంది. మీకు తెలీదు వదినా.. ఇష్టం లేని పెళ్లి జరిగితే.. ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో.. దానికి కావ్య వదిన జీవితమే ఉదాహరణ. నిజంగానే మా అమ్మ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మా అమ్మ ఉన్నా.. ఈ రుద్రాణి అత్తయ్య వాళ్లు అస్సలు ఉండనివ్వరు అని కళ్యాణ్ అంటాడు.
కళ్యాణ్‌ని ఆపమని కావ్యకి చెప్పిన రాజ్..
అప్పూని తీసుకుని కళ్యాణ్ వెళ్తుండగా.. కనకం ఆపుతుంది. బాబూ మా ఇంటికి రండి.. మా ఇంట్లోనే ఉందురు. బాబూ మీరు నా కూతురికి జీవితం ఇచ్చినందుకు సంతోష పడాలో.. మీ కుటుంబానికి దూరం అవుతున్నారని బాధ పడాలో తెలీడం లేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి.. ఎక్కడ కష్టాలు పడతారు. మా ఇంట్లో అయినా ఉండమని కృష్ణమూర్తి, కనకం అంటారు. అయినా కళ్యాణ్ ఒప్పుకోడు. అప్పూని తీసుకుని బయటకు వెళ్తాడు. వాడు వెళ్లిపోతున్నాడు.. ఆపు కళావతి.. నువ్వు చెప్తే వెంటాడు. ఆగుతాడు.. ఆగమని చెప్పు అని రాజ్ అంటే.. నన్ను క్షమించండి నేను ఆపను అని కావ్య అంటుంది. నీ మాట అంటే వాడికి గౌరవం.. వేదం. అందరూ ఉండి వాడు ఎవరూ లేని వాడిలా వెళ్తున్నాడని రాజ్ అంటాడు. ఈ విషయంలో నాకు ఏం సంబంధం లేదు. ఆ మంగళ సూత్రం ఇచ్చి కట్టమని ఇచ్చింది మీరు. కావాలంటే మీరే ఆగమనండి అని కావ్య అంటుంది.
ఎక్కడ ఉండాలో కళ్యాణ్, అప్పూల ప్లాన్..
బయటకు వచ్చేసిన కళ్యాణ్, అప్పూలు ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటారు. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్తారు. జరిగింది అంతా గుర్తుకు తెచ్చుకుని బాధ పడుతూ ఉంటారు. కళ్యాణ్ బ్రో అని పిలుస్తూ ఉంటే.. ఇంకా బ్రో ఏంటి రా అని అప్పూ అంటే.. ఇంకా రా ఏంటి రా అని కళ్యాణ్ అంటాడు. ఇద్దరూ కాసేపు నవ్వుకుని.. అంతా చిత్రంగానే ఉందని ఇద్దరూ అనుకుంటారు. ఇప్పటి నుంచి మనం కొద్ది దారి వెతుక్కోవాలి. నీకు తెలియకుండా నీలో చాలా బలం, ధైర్యం ఉంది. పైకి అంతా బాగానే ఉన్నా భయంగా ఉంది. అక్కడ మీ అమ్మ, అత్త కలిసి మా అమ్మని, అక్కల్ని ఎన్ని మాటలు అంటారో అని అప్పూ అంటుంది. ఇక ఉండటానికి.. ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేస్తారు కళ్యాణ్, అప్పూలు. మరోవైపు ఇంట్లో మరో చిచ్చు రాజేస్తుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.