Brahmamudi, August 9th Episode: మొగుడిని వదిలేసి ఇక్కడ పడి ఉంటున్నావ్.. రుద్రాణికి అపర్ణ వార్నింగ్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కనకం ఫ్యామిలీని తిడుతూ ఉంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో మగ పిల్లలకు కనకం కూతుర్లతో ఏనాడో రాసి పెట్టేసి ఉంది. మనం ఎంత అనుకుంటే ఏం లాభం? ఒకరితో అనుకుంటే ఇంకొకరితో జరుగుతుంది. కానీ కనకం ఇంటి ఆడ పిల్లలతోనే జరుగుతుంది. ఆ కనకం పెళ్లికి శుభ లేఖలతో పిలవడానికి వచ్చినప్పుడే వచ్చింది అనుకున్నా. మనం అంతా పెళ్లికి పట్టు చీరలు, నగలు సింగారించుకుని వెళ్లి.. రుక్మిణీ కళ్యాణం చూసి తరించామని..

Brahmamudi, August 9th Episode: మొగుడిని వదిలేసి ఇక్కడ పడి ఉంటున్నావ్.. రుద్రాణికి అపర్ణ వార్నింగ్..
Brahmamudi (1)Image Credit source: disney hotstar
Follow us

|

Updated on: Aug 09, 2024 | 1:46 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కనకం ఫ్యామిలీని తిడుతూ ఉంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో మగ పిల్లలకు కనకం కూతుర్లతో ఏనాడో రాసి పెట్టేసి ఉంది. మనం ఎంత అనుకుంటే ఏం లాభం? ఒకరితో అనుకుంటే ఇంకొకరితో జరుగుతుంది. కానీ కనకం ఇంటి ఆడ పిల్లలతోనే జరుగుతుంది. ఆ కనకం పెళ్లికి శుభ లేఖలతో పిలవడానికి వచ్చినప్పుడే వచ్చింది అనుకున్నా. మనం అంతా పెళ్లికి పట్టు చీరలు, నగలు సింగారించుకుని వెళ్లి.. రుక్మిణీ కళ్యాణం చూసి తరించామని రుద్రాణి ఎద్దేవా చేస్తుంది. అయిపోయింది.. అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో.. అదే జరిగింది. స్నేహం స్నేహం అని చెప్పి ఈ కన్న తల్లికే ద్రోహం చేసి వెళ్లాడని ధాన్య లక్ష్మి ఏడుస్తుంది. ఎప్పుడూ నీ మనసులో ఉన్నదే వాడిపై రుద్దావు తప్పా.. వాడి మనసులో అసలు ఏముందో అడిగావా? తెలుసుకున్నావా? నీ కోసం వాడి ఇష్టాన్ని ఇంత కాలం గుండెల్లోనే దాచుకుని.. చివరకు అప్పూ శాశ్వతంగా దూరం అయిపోయిందని భయపడి ఇప్పుడు ముందుకు అడుగు వేశాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని.. ఇప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడని ప్రకాశం అంటాడు.

అన్నీ వదిలేసి ఎలా బ్రతుకుతాడు ధాన్య లక్ష్మి బాధ..

ఏముందని బ్రతుకుతాడు? ఏం చేసి సంపాదిస్తాడు? ఆ అప్పూ అనే మహమ్మారి దాపురించిన దగ్గర నుంచి వాడి బ్రతుకు బజారున పడిందని ధాన్య లక్ష్మి అంటాడు. చూడమ్మా కళ్యాణ్ ఎక్కడ ఉన్నా దుగ్గిరాల వారసుడే. వాళ్లు ఎప్పటి నుంచో ఒకరినొకురు ఇష్ట పడ్డారు. ఇప్పుడు వాడు కోరుకున్నదే జరిగింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడని సుభాష్ అంటాడు. అది కూడా ఒక సంతోషమేనా బావగారు? ఆస్తిని, అందరినీ వదిలేసి ఎలా బ్రతుకుతాడని ధాన్య లక్ష్మి అంటుంది. ఇదంతా రాసి పెట్టి ఉంది ధాన్య లక్ష్మి. దీనంతటికీ కారణం.. ఈ కావ్య, కనకం, స్వప్న, అప్పూలు. వీళ్లు మొత్తం మన ఇంటి సుఖ సంతోషాలను అమ్మేశారని అంటుంది రుద్రాణి.

నీ మొగుడు సంపాదించాడా..

రుద్రాణి మాటలకు స్వప్న సీరియస్ అవుతుంది. ఏం అమ్మేసుకున్నాం.. నీ మొగుడి ఆస్తినా.. నా మొగుడు సంపాదించిన ఆస్తినా? లేక ఈ దుగ్గిరాల ఆస్తినా? నీ కొడుకు మోసం చేస్తే నా పెళ్లి జరిగింది. నేను మోస పోవడం వల్ల కావ్య పెళ్లి జరిగింది. ఇప్పుడు జరిగిందే అసలైన పెళ్లి. కావ్య, నేనూ ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాం. కానీ అప్పూ, కళ్యాణ్‌లు మాత్రం ఇష్ట పడే పెళ్లి చేసుకున్నారు. ఏం ఉన్నా లేకపోయినా.. వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉంటారని స్వప్న అంటుంది. మోసాల గురించి నువ్వు మాట్లాడకు. మీ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ ఎన్ని మోసాలు చేసి ఈ గడపలో కాలు పెట్టారో తెలుసని రుద్రాణి దెప్పి పొడుస్తుంది. అవును మోసాలే చేశాం. ఇప్పుడేంటి? ఇప్పుడు జరిగిన దాని గురించి వదిలేసి.. ఎప్పుడో జరిగి పోయిన విషయం తీసుకొస్తారేంటి? ఎవరు ఏలాంటి మోసాలు చేశారో.. ఇక్కడికి ఎలా వచ్చామో అందరికీ తెలుసని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

నోరు తెరిచావా నాలుక కోస్తా..

షటప్.. రాజ్ నిన్ను బాగా చూసుకునే సరికి ఎవర్నీ లెక్క చేయకుండా తయారయ్యారు. మీరంతా మంత్రగత్తెలు.. అందర్నీ మీ మాయలతో మీ వైపుకు తిప్పుకున్నారని రుద్రాణి అంటుంది. నువ్వు నోరు మూస్తావా? ఇక్కడ ఓ తల్లి ఏడుస్తుంది. తండ్రి కుమిలి పోతున్నాడు. అందరూ తల్లడిల్లి పోతున్నారు. నువ్వు ఆడదానివే అయితే.. వాళ్లను ఓదార్చు. లేదంటే నోరు మూసుకుని నిలబడు. నోరు తెరిచావా నాలుక కోస్తా.. అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. స్వప్న మా అమ్మ దానిలో తప్పేం ఉంది? కళ్యాణ్ ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయాడంటే.. అప్పూ వల్లనే కదా? అని రాహుల్ అంటాడు. అప్పుడే ఇందిరా దేవి రియాక్ట్ అవుతూ.. రుద్రాణి, రాహుల్ కాసేపు సైలెంట్‌గా ఉంటారా? ఈ పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడుకుని లాభం లేదు. అనామికను పెళ్లి చేసుకోక ముందు.. తన మనసులో అప్పూ ఉందన్న సంగతి కళ్యాణ్ గుర్తించ లేదు. అది కళ్యాణ్ తప్పు.. కళ్యాణ్ పెళ్లి చేసుకోక ముందే తన మనసులో మాట చెప్పనందుకు అప్పూ తప్పు. అప్పుడు కష్టమైనా.. నష్టమైనా ముందు ఉండి వాళ్ల పెళ్లి జరిపించే వాళ్లు. ఇలా హఠాత్తుగా పెళ్లి చేసుకుని.. వాళ్లు సంతోషంగా ఉంటారో లేదో కూడా వాళ్లకు తెలీదు. కానీ ఈ ఇంటి వారసుడు బయటకు వెళ్లే పరిస్థితి రానిచ్చే వాళ్లం కాదని ఇందిరా దేవి అంటుంది.

కావ్యపై నోరు పారేసుకున్న ధాన్య లక్ష్మి..

చాలా నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇష్టం లేకపోయినా.. జరగనంటూనే నువ్వూ రాజ్ కలిసి అప్పూకి అప్పజెప్పేశారు. నా ఒక్క కొడుకు దూరంగా వెళ్లిపోయాడు. ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు. ఇంకేం చెబుతుంది వదినా.. అందర్నీ ఏటిలో ముంచేసి వినోదం చూస్తుంది. రాజ్ ని కొంగున ముడేసుకుని ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటుంది. నీ ఒక్కగానొక్క కొడుకుని నీ దగ్గరకు కూడా రానివ్వకుండా చేస్తారని రుద్రాణి దెప్పిపొడుస్తుంది.

నువ్వు పరాయి దానివి.. హద్దుల్లో ఉండు..

అపర్ణ లేచి.. నువ్వు ఎందుకు నీ భర్తని కొంగున ముడేసుకోలేదు. మా ఇంటి మీదకు వచ్చి పడ్డావేంటి? నా కొడుకుని కొంగున ముడేసికుని నా కోడలు ఏం సాధించింది? ధాన్య లక్ష్మిని ఓదార్చుతావని చూశాను. కానీ నువ్వు అగ్నిలో ఆజ్యం పోస్తున్నావ్. ఇందులో కావ్య, కనకం, అప్పూ తప్పు లేదని అందరికీ తెలుసు. తమ్ముడు మనసు తెలుసుకున్న రాజ్.. తాళి కట్టమని కళ్యాణ్‌కు ఇచ్చాడు. నువ్వు మొదటి నుంచీ ఏ సమస్య వచ్చినా.. మనసుల్లో విషం చిమ్మాలని చూస్తున్నావ్. ఆడపడుచు.. పుట్టింటి సుఖం, సంతోషం కోరుకుంటుంది. కానీ నువ్వు మా సొంత ఆడ పడుచువి కాదు. పరాయి పంచన పడి ఉండేదానివి. నీ హద్దుల్లో నువ్వు ఉండు అని అపర్ణ అంటుంది. ఏమన్నావ్? నన్నే పరాయి దానివి అంటావా వదినా? అమ్మా, నాన్నా విన్నారా? అని రుద్రాణి అంటుంది. అమ్మ ఎవరు? నాన్న ఎవరు? భర్తని వదిలేసి వస్తే.. ఇంత కాలం సానుభూతిగా చూస్తూ నా కొడుకులు, కోడళ్లు నిన్ను కలుపుకున్నారు. కానీ వాళ్ల మధ్యనే విభేదాలు వచ్చేలా చేస్తే నువ్వు ఎవరు? మేము ఎవరు? అని ఇందిరా దేవి అంటే.. రుద్రాణి ఏడుస్తూ పైకి వెళ్తుంది. ధాన్య లక్ష్మి నువ్వు దుఃఖంలో ఉన్నావు. వెళ్లు కాసేపు ప్రశాంతంగా ఉండు. ఆ తర్వాత మాట్లాడుకుందామని అపర్ణ అంటుంది.

అప్పూని చీరలో చూసి షాక్ అయిన ఫ్రెండ్స్..

మరోవైపు అప్పూ కోసం కనకం, కృష్ణ మూర్తిలు బాధ పడుతారు. జరిగినదంతా తలుచుకుంటారు. కట్ చేస్తే.. అప్పూ తన ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకెళ్తుంది. అప్పూని చీరలో చూసిన వాళ్లు పగలబడి నవ్వుతారు. రేయ్ చంపుతా అని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. మీరు ఎప్పుడూ ఇలానే ఉంటారా? అని కళ్యాణ్ అడిగితే.. ఇలాంటి డెవిల్‌ని పెళ్లి చేసుకున్నారు. తలుచుకుంటేనే భయం వేస్తుందని మజాక్ చేస్తారు. మరి ఇక్కడ నువ్వు అడ్జెస్ట్ అవ్వగలరా? అని అడిగితే.. పర్వాలేదని కళ్యాణ్ అంటాడు.