AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhita Dhulipala Net Worth: చైతూకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల ఎవరో తెలుసా..? ఎన్ని కోట్లకు వారసురాలంటే..

శోభిత ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభితా.. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన "రమణ్ రాఘవ్ 2.0"తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Sobhita Dhulipala Net Worth: చైతూకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల ఎవరో తెలుసా..? ఎన్ని కోట్లకు వారసురాలంటే..
Naga Chaitanya, Shobitha Dh
Rajitha Chanti
|

Updated on: Aug 08, 2024 | 4:15 PM

Share

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఈరోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు హీరో నాగార్జున. “ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8.8.8అనంతమైన ప్రేమ ప్రారంభం” అంటూ రాసుకొచ్చారు నాగ్. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అందులో వీరిద్దరూ సంప్రదాయ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ దుస్తులను బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.

ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సినిమాలు, నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభంచిన చైతన్య ఆస్తులు ఇప్పటివరకు రూ154 కోట్లు. అలాగే లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభితా ధూళిపాళ నికర విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుంది. శోభిత ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభితా.. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన “రమణ్ రాఘవ్ 2.0″తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే మేజర్ మూవీలోనూ నటించింది. పొన్నియిన్ సెల్వన్, మేడ్ ఇన్ హెవెన్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. శోభితా ధూళిపాళ ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 70 లక్షల నుండి 1 కోటి వరకు వసూలు చేస్తుంది. “పొన్నియిన్ సెల్వన్: ఐ”లో తన పాత్ర కోసం ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. శోభిత నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనల ద్వారా గణనీయంగా సంపాదిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.