Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master : ‘మైనర్‏గా ఉన్నప్పటి నుంచే జానీ వేధించాడు’.. సింగర్ చిన్మయి రియాక్షన్..

తాజాగా సింగర్ చిన్మయి సైతం ఈ కేసుపై స్పందించింది. పలు మీడియా కథానాలను ట్యాగ్ చేస్తూ.. "నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను " అని ఆమె ట్వీట్ చేశారు.

Jani Master : 'మైనర్‏గా ఉన్నప్పటి నుంచే జానీ వేధించాడు'.. సింగర్ చిన్మయి రియాక్షన్..
Jani Master, Singer Chinmayi
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: Sep 19, 2024 | 4:05 PM

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత రెండు రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నాడని ఓ యువతి అతడిపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖులు జానీ మాస్టర్ వేధింపుల కేసుపై రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సింగర్ చిన్మయి సైతం ఈ కేసుపై స్పందించింది. పలు మీడియా కథానాలను ట్యాగ్ చేస్తూ.. “నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను ” అని ఆమె ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా జానీ మాస్టర్ వద్ద పనిచేస్తుంది. సినిమా షూటింగ్స్ నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జానీ మాస్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం చేశాడని.. ఈ విషయాన్ని బయటపెడితే ఇబ్బందిపెడతానని బెదిరించాడని.. ఇండస్ట్రీలో ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య కూడా తనను తీవ్రంగా వేధించిందని తెలిపింది. జానీ మాస్టర్ బూతులు తిట్టేవాడని.. అభ్యంతరకరంగా తాకేవాడని.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు ఈ కేసును బదిలీ చేశారు.

ఇప్పటికే యువతి స్టేట్‌మెంట్‌ తీసుకున్న ముగ్గురు పోలీసులు బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు పోలీసులు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఇప్పటివరకు జానీ మాస్టర్ స్పందించలేదు. జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఈ ఆరోపణల కారణంగా అతడిని పార్టీకి దూరంగా ఉండాల్సిందని ఇప్పటికే జనసేన అధిష్టానం ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.