Alia Bhatt: పెళ్లైన ఇన్నాళ్లకు ఇంటి పేరు మార్చుకున్న అలియా భట్.. కారణమేంటో తెలుసా?

గతంలో కరీనా కపూర్ సైఫ్‌తో వివాహం తర్వాత ఖాన్ పేరును జోడించుకుంది. అదే విధంగా అభిషేక్ తో వివాహం తర్వాత  బచ్చన్ పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంది.  ఇప్పుడు అలియా భట్ కూడా అదే చేసింది. అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 2022 లో వివాహం చేసుకున్నారు.

Alia Bhatt: పెళ్లైన ఇన్నాళ్లకు ఇంటి పేరు మార్చుకున్న అలియా భట్.. కారణమేంటో తెలుసా?
Alia Bhatt Family
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 12:16 PM

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అలియా భట్. ఆమె ఇప్పుడు కపూర్ కుటుంబానికి కోడలు. కొందరు వేరే కుటుంబంలోకి వెళ్లిన తర్వాత పేరు మార్చుకున్నారు. గతంలో కరీనా కపూర్ సైఫ్‌తో వివాహం తర్వాత ఖాన్ పేరును జోడించుకుంది. అదే విధంగా అభిషేక్ తో వివాహం తర్వాత  బచ్చన్ పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంది.  ఇప్పుడు అలియా భట్ కూడా అదే చేసింది. అలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 2022 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే వివాహం తర్వాత అలియా తన పేరు మార్చుకోలేదు. అయితే ఇప్పుడు తన పేరును మార్చుకున్నట్లు వెల్లడించిందీ అందాల తార. బాలీవుడ్ ప్రముఖ రియాలిటీ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2’ షోలో భాగంగా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది అలియా భట్. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. దీని ప్రోమో విడుదలైంది. అలియా భట్ నటించిన ‘జిగ్రా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీని ప్రమోషన్ కోసం అలియా భట్ ఇక్కడికి వచ్చింది. షోలో భాగంగా సునీల్ గ్రోవర్‌ని ‘ఆలియా భట్’ అని పిలుస్తారు. దీనిపై స్పందించిన అలియా. ‘నేను ఇప్పుడు అలియా భట్ కపూర్‌ని’ అని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాలో అలియా భట్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు అలియా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 1993లో వచ్చిన ‘గుమ్రా’ చిత్రానికి ఇది రీమేక్‌ అని అంటున్నారు. ‘గుమ్రా’లో సంజత్ దత్, శ్రీదేవి, రాహుల్ రాయ్ నటించారు. ఇక ‘యష్ రాజ్ చోప్రా ఫిల్మ్స్’ స్పై యూనివర్స్ లో అలియా కూడా భాగమైంది. ఇందులో భాగంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘లవ్ అండ్ వార్’లో కూడా అలియా నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ రెండో సీజన్ ప్రోమో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!