- Telugu News Photo Gallery Cinema photos Who is the captain guiding Heroine Janhvi Kapoor in NTR Devara movie promotions Telugu Actress Photos
Janhvi Kapoor: జాన్వీని గైడ్ చేస్తున్న కెప్టెన్ ఎవరు.? తెలుగులో వరస సినిమాలు..
ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి. తన జీవితంలో అలాంటి రోల్ పోషించింది కరణ్ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్. ఇంతకీ ఆమెకు కరణ్ ఎలాంటి సజెషన్ ఇచ్చారు.? దేవర సినిమాతో సౌత్‌లో అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్.
Updated on: Sep 17, 2024 | 1:01 PM

ఎప్పుడైనా ఎవరికైనా గైడెన్స్ చాలా ముఖ్యం. మన ముందు రెండు దారులున్నప్పుడు, ఏ దారిని సెలక్ట్ చేసుకోవాలోననే తికమక కనిపించినప్పుడు, రెండిటిలో ఒకదాన్ని చూజ్ చేసుకోమని సలహా చెప్పేవాళ్లు కావాలి.

తన జీవితంలో అలాంటి రోల్ పోషించింది కరణ్ జోహారేనని అన్నారు జాన్వీ కపూర్. ఇంతకీ ఆమెకు కరణ్ ఎలాంటి సజెషన్ ఇచ్చారు.?

దేవర సినిమాతో సౌత్‌లో అడుగుపెడుతున్నారు జాన్వీ కపూర్. ఈ సినిమాను యాక్సెప్ట్ చేయడానికి ముందు, ఆమెకు మరో తమిళ ఆఫర్ కూడా వచ్చిందట.

దీపిక, దిశా ప్రూవ్ చేసుకున్న ఇదే ఏడాది తన లక్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయారు. కచ్చితంగా హిట్ అందుకుంటాననే ధీమా కనిపిస్తోంది శ్రీదేవి తనయలో.

కరణ్ ఇచ్చిన సలహా తనకు చాలా బాగా ఉపయోగపడిందని అంటున్నారు జాన్వీ కపూర్. ఇప్పుడు రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.

ఇంకో రెండు సినిమాలు కూడా సెట్స్ మీదున్నాయి. దేవర సినిమాలో ఈమె రోల్ కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టానని అన్నారు కొరటాల. నార్త్ లో నాకు సినిమాలకేం తక్కువలేదు. వరుసగా ఆఫర్లున్నాయి.

ఇప్పటి వరకు చేసినవి కూడా పది కాలాలపాటు గుర్తుండిపోయే పాత్రలే. సౌత్‌లోనూ అంతకు మించిన పేరు తెచ్చుకోవాలన్నది నా కల. అది జరిగితే మా అమ్మ ఆశయం నెరవేరినట్టేనని చెబుతున్నారు జాన్వీ.




