- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress In This Photo She Is Heroine Kalyani Priyadarshan, See Photos
Tollywood: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఈ అమ్మాడి క్రేజ్ చూస్తే షాకే.. మహానటి బెస్ట్ ఫ్రెండ్..
చాలా కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలో బొద్దుగా అసలు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయిల కళల రాకూమరి.
Updated on: Sep 17, 2024 | 11:29 AM

చాలా కాలంగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఆశ్చర్యపోతున్నారు. తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

ఆ ఫోటోలో బొద్దుగా అసలు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు అబ్బాయిల కళల రాకూమరి. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఆ తర్వాత వరుస ఆఫర్లను వచ్చినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సొంతం చేసుకుంది.

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. హలో సినిమా తర్వాత 'చిత్రలహరి' 'రణరంగం' చిత్రాల్లో నటించింది.

అలాగే శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైన కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు తమిళ్ సినిమాల్లో నటిస్తుంది.

కళ్యాణి ప్రియదర్శన్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ - సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి. అంతేకాదు మహానటి కీర్తి సురేష్ బెస్ట్ ఫ్రెండ్ కూడా.




