- Telugu News Photo Gallery Cinema photos Competing atmosphere trend has shifted towards support between heroes
Heroes: హీరోల మధ్య మారుతున్న ఈక్వేషన్స్.. హెల్పింగ్ హ్యాండ్ అంటూ..
ఇండస్ట్రీలో హీరోల మధ్య ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు హీరోలు మధ్య ఎక్కువగా పోటి వాతావరణమే కనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటున్నారు. ఒకరికొకరు పోటి అనుకుంటున్న హీరోలు కూడా సోదరభావం సర్దుకుపోతున్నారు.
Updated on: Sep 17, 2024 | 10:03 AM

రీసెంట్‌గా సైమా అవార్డ్స్ వేదిక మీద విజయ్ దేవరకొండ, నాని కలిసి కనిపించారు. ఈ ఇద్దరు హీరోలు దాదాపు ఒకే జానర్ సినిమాలతో పోటి పడుతున్నారు. వీళ్ల ఆడియన్స్ కూడా సేమ్ సెక్షన్‌లోనే ఉంటారు. అందుకే ఈ ఇద్దరి మధ్య పోటి ఉంటుందని భావించిన ప్రేక్షకులకు షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ.

తనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన ఎవడే సుబ్రమణ్యం సినిమా సమయంలో నాని తనకు ఎంతో సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇక మీదట నానిని అన్నా అనే పిలుస్తా అన్నారు విజయ్. ఈ కామెంట్స్ మీద స్పందించిన నాని, విజయ్ తపన ఉన్న యాక్టర్ అంటూ కితాబిచ్చారు.

రీసెంట్ టైమ్స్‌లో యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్దూ జొన్నలగడ్డ కూడా ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఒకరి సినిమాల ఈవెంట్స్‌కు మరొకరు అటెండ్ అవుతూ ప్రమోషన్స్‌కి మరింత బజ్ వచ్చేలా చూసుకుంటున్నారు.

యంగ్ హీరోలే కాదు టాప్ స్టార్స్ మధ్య కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. కోలీవుడ్‌లో విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా కనిపిస్తోంది.

ది గోట్ ప్రమోషన్స్‌లో అజిత్ ప్రస్థావన మళ్లీ మళ్లీ వచ్చింది. అజిత్ నెక్ట్స్ సినిమాలో విజయ్ రిఫరెన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా హీరోలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.




