Shruti Haasan: బాలయ్య సినిమాలో క్రాక్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందంటున్నారే..

నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో అఖండంగా గర్జించనున్నారు. బాలయ్యను అభిమానులకు ఎలా చూపించాలో బాగా తెలిసిన బోయపాటి..

Shruti Haasan: బాలయ్య సినిమాలో క్రాక్ హీరోయిన్.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందంటున్నారే..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2021 | 12:38 PM

Shruti Haasan: నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో అఖండంగా గర్జించనున్నారు. బాలయ్యను అభిమానులకు ఎలా చూపించాలో బాగా తెలిసిన బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సింహ, లెజండ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే అఖండ టీజర్ తో అంచనాలను ఆకాశానికి చేర్చిన బోయపాటి.. సినిమాను కూడా అదే రేంజ్ లో సిద్ధం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత  బాలకృష్ణ..  గోపిచంద్ మలినేనితో చేస్తున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన గోపిచంద్.. బాలయ్యకు కథ చెప్పడం.. దాన్ని ఓకే చేయడం చకచకా అయిపోయింది.  అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నారట. రాయలసీమ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా  శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో గోపీచంద్ తెరకెక్కించిన బలుపు సినిమాలో రవితేజ సరసన నటించింది శృతి అలాగే ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాలో కూడా చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మూడో సారి గోపీచంద్ డైరెక్షన్లో సినిమా చేయనుందని అంటున్నారు. గోపీచంద్ అడగ్గానే శ్రుతి హాసన్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని  సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ‘అఖండ’ సినిమా జులైలో పూర్తి కానుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ సినిమాను పట్టాలెక్కిన్చానున్నాడు బాలయ్య.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ravi Teja’s Khiladi: ఓటీటీ లో మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడి’ మూవీ .. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Nagarjuna: జూన్ నుంచి జోరు పెంచనున్న నాగార్జున.. శరవేగంగా కొత్త సినిమా షూటింగ్

KD Chandran: బాలీవుడ్ నటుడు కేడీ చంద్రన్ కన్నుమూత.. చికిత్స పొందుతూ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే