Varun Tej: మరో సూపర్ హిట్ డైరెక్టర్ తో చేతులు కలిపిన మెగా హీరో వరుణ్ తేజ్.. ఈసారి
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతున్నాడు. ఇప్పటికే రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతున్నాడు. ఇప్పటికే రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటి కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ అనే సినిమా చేస్తున్నాడు వరుణ్ . స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే బాక్సింగ్ లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం.. ఆ తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఇటీవల తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరిపారు. కొంత భాగం షూటింగ్ జరపగానే కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది.ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.
వరుణ్ తేజ్ త్వరలో డైరెక్టర్ వెంకి కుడుములతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఛలో- భీష్మ లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు వెంకీ కుడుముల. ఆతర్వాత అగ్ర హీరోలతో పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసాడట. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్లతో ప్రేమకథలతో మెప్పించగల సమర్థుడని ఇప్పటికే ప్రూవ్ చేశాడు వెంకీ. వరుణ్ తేజ్ తో ఏ తరహా సినిమా తీస్తారు అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే..
మరిన్ని ఇక్కడ చదవండి :