Upendra: ‘నా జీవితంలో ఇష్టమైన దర్శకుడివి నువ్వే’.. ఉపేంద్రతో ‘ఓం’ అనుభవాలను గుర్తు చేసుకున్న శివన్న

కన్నడ స్టార్‌ హీరోలు ఉపేంద్ర, శివరాజ్‌కుమార్‌ల మంచి అనుబంధం ఉంది. అది ఈనాటిది కాదు. ఉపేంద్ర డైరెక్ట్‌ చేసిన ‘ఓం’ (తెలుగులో ఓంకారం (రాజశేఖర్‌ నటించారు) సినిమాతోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకన్నారు శివరాజ్‌కుమార్‌. కాగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఆయన డైరెక్ట్‌ చేసిన 'యూఐ' సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శివరాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గీతా శివరాజ్‌కుమార్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు

Upendra: 'నా జీవితంలో ఇష్టమైన దర్శకుడివి నువ్వే'.. ఉపేంద్రతో 'ఓం' అనుభవాలను గుర్తు చేసుకున్న శివన్న
Upendra, Shivarajkumar
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2023 | 10:22 PM

కన్నడ స్టార్‌ హీరోలు ఉపేంద్ర, శివరాజ్‌కుమార్‌ల మంచి అనుబంధం ఉంది. అది ఈనాటిది కాదు. ఉపేంద్ర డైరెక్ట్‌ చేసిన ‘ఓం’ (తెలుగులో ఓంకారం (రాజశేఖర్‌ నటించారు) సినిమాతోనే స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకన్నారు శివరాజ్‌కుమార్‌. కాగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఆయన డైరెక్ట్‌ చేసిన ‘యూఐ’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శివరాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గీతా శివరాజ్‌కుమార్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈరోజు ఉపేంద్ర పుట్టినరోజు  కావడంతో శివరాజ్‌కుమార్ , గీత దంపతులు ఉప్పికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివన్న ఉపేంద్ర గురించి మాట్లాడారు. ‘ఉప్పికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో నాకు ఇష్టమైన దర్శకుడు నువ్వే. నా ఇమేజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లిన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు నేను నా కళ్లతో నటిస్తానని అందరూ అంటున్నారు. కానీ అది నీ వల్లే నాకు మొదట తెలిసింది. ఈరోజు ఇండియా మొత్తం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది’ అని ఉప్పీపై ప్రశంసలు కురిపించాడు శివన్న. ఈ సందర్భంగా ‘ఓం’ సినిమా సందర్భాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు శివరాజ్‌కుమార్‌. ‘ ఓం సినిమా ఇంట్రడక్షన్ సీన్ గురించి రజనీకాంత్ ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఇంట్రడక్షన్ సీన్ నేనెప్పుడూ చూడలేదని అంటున్నారు. ఆ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేం. మనిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ ఎప్పుడు సినిమా వస్తుంది అని అభిమానులు అడుగుతుంటారు. నేనూ దాని కోసమే వెయిట్ చేస్తున్నాను’ అని ఎమోషనల్‌అయ్యారు శివన్న.

కాగా ఉపేంద్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యూఐ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. బెంగళూరులోని ఊర్వశి సినిమా వద్ద వేలాది మంది అభిమానుల సమక్షంలోయూఐ టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్, దునియా విజయ్ సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఎప్పటిలాగేమరోసారి యూఐ టీజర్‌తో తన క్రియేటివిటీని చాటుకున్నారు ఉపేంద్ర. చిత్ర బృందం విడుదల చేసిన ఈ టీజర్‌లో ఎలాంటి దృశ్యాలు కనిపించలేదు. కొన్ని డైలాగులు, శబ్దాలు మాత్రమే వినిపించాయి. ‘చీకటి.. అంతా చీకటి..’ అంటూ మొదలైన టీజర్‌లో కేవలం శబ్దాలు మాత్రమే వినిపించాయి. ‘ఇది ఏఐ వరల్డ్‌ కాదు. ఇది యూఐ వరల్డ్‌. దీని నుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి. ఈ టీజర్‌ మీ ఊహ కోసమే’ అన్న వాయిస్‌తో సాగిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర యూఐ టీజర్..

View this post on Instagram

A post shared by Upendra (@nimmaupendra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం