Samantha: ఇదొక మాస్టర్‌ పీస్‌.. ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సమంత..

కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజవుతోంది. ' సప్తసాగరాలు దాటి' పేరుతో సెప్టెంబర్‌ 22న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత చూసి ఎమోషనల్‌ అయ్యారట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుందామె. 'మాస్టర్‌ పీస్‌' అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించింది.

Samantha: ఇదొక మాస్టర్‌ పీస్‌.. ఆ బ్లాక్‌ బస్టర్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సమంత..
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 2:06 PM

రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో మూవీ’ సెప్టెంబర్ 1న విడుదలై భారీ విజయం సాధించింది. ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ యూత్‌ను ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. ‘గోది బళ్ల సర్దార్ మైకట్టు’ సినిమా తర్వాత రక్షిత్ , దర్శకుడు హేమంత్ రావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో చైత్ర ఆచార్, అవినాష్, పవిత్రా లోకేష్, శరత్ లోహితాశ్వ, రమేష్ ఇందిర, అచ్యుత్ కుమార్, గోపాల్ దేశ్‌పాండే తదితరులు కీలకపాత్రలు పోషించారు. చరణ్ రాజ్ అందించిన స్వరాలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. కన్నడలో సూపర్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజవుతోంది. ‘ సప్తసాగరాలు దాటి’ పేరుతో సెప్టెంబర్‌ 22న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత చూసి ఎమోషనల్‌ అయ్యారట. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుందామె. ‘మాస్టర్‌ పీస్‌’ అంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించింది. కాగా రక్షిత్‌ శెట్టి నటించిన ఈ సూపర్‌ హిట్‌ సినిమా తెలుగు వెర్షన్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటిభాగం సెప్టెంబర్ 1న రిలీజ్ కాగా.. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు.

మరోవైపు శాకుంతలం సమంత నటించిన ఖుషి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఖుషి నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సామ్, విజయ్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందే విదేశాలకు వెళ్లిపోయింది సమంత. మొదట తన మయోసైటిస్‌ చికిత్స కోసం సామ్‌ అమెరికా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసి హాలీవుడ్‌ సినిమా ఫొటోషూట్స్‌ కోసమే వెళ్లిందని కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు సామ్‌ ఇండియాకు తిరిగొచ్చి కొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తుందట. అందులో భాగంగానే సప్త సాగరదాచే ఎల్లో మూవీ చూసిందట. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ప్రియాంక చోప్రా సిటాడెబ్‌ వెబ్‌ సిరీస్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. రక్షిత్ శెట్టి నటించిన ‘హాస్టల్ బాయ్స్ వాంటెడ్’ చిత్రం కన్నడలో మంచి విజయం సాధించి తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌గా విడుదలైంది. అలాగే తెలుగులో కూడా ‘సప్త సాగరదాచే ఏలో’ విడుదలవుతోంది. అంతకుముందే ఈ సినిమా సమంత ప్రశంసలు అందుకోవడంతో చిత్రబృందం ఆనందంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి