Bigg Boss7 Telugu: శివాజీ సాలిడ్ దెబ్బకు.. బిత్తరపోయిన అమర్. నామినేషన్సా.. మజాకా..

ఇక 15thడే 16th ఎపిసోడ్ అయిన ఈ నామినేషన్స్ కోసం బిగ్ బాస్ లవర్స్ అందరూ.. పోయిన మంగళవారం అంటే తాజా నామినేషన్స్ ఎపిసోడ్ అంటే సెప్టెంబర్ 12 నుంచి ఎదరుచూస్తూనే ఉండి ఉంటారు. రోజు వారి ఎపిసోడ్స్ చూస్తూ.. ఈ వారం నామినేషన్స్ దద్దరిల్లిపోతాయని.. కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో ఉంటుందని చాలా మందే అనుకుని ఉంటారు. ఈ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే అలా ఎదురు చూసే వారిని కాస్త డిస్సపాయింట్ చేసింది ఈ తాజా నామినేషన్ ఎపిసోడ్!

Bigg Boss7 Telugu: శివాజీ సాలిడ్ దెబ్బకు.. బిత్తరపోయిన అమర్. నామినేషన్సా.. మజాకా..
Big Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2023 | 6:43 AM

పక్కింట్లో గొడవైతే ఏం చేస్తాం..! తొంగి మరీ చూస్తాం.. ఉన్న పనులన్నీ పక్కకుపెట్టి మరీ.. ఏం జరుగుతుందోనని..ఎంతో ఆతురతగా.. ఆ గొడవనే ఫాలో అవుతూ ఉంటాం. ఇక అదే గొడవ బిగ్ బాస్ ఇంట్లోనూ.. జరిగితే ఏం చేస్తాం..! టీవీలకు అతుక్కొనే ఉంటాంగా..! అందులోనూ మాగ్జిమమ్ గొడవలయ్యే నామినేషన్ ఎపిసోడ్ కోసం వారమంతా.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాంగా..! ఇక 15thడే 16th ఎపిసోడ్ అయిన ఈ నామినేషన్స్ కోసం బిగ్ బాస్ లవర్స్ అందరూ.. పోయిన మంగళవారం అంటే తాజా నామినేషన్స్ ఎపిసోడ్ అంటే సెప్టెంబర్ 12 నుంచి ఎదరుచూస్తూనే ఉండి ఉంటారు. రోజు వారి ఎపిసోడ్స్ చూస్తూ.. ఈ వారం నామినేషన్స్ దద్దరిల్లిపోతాయని.. కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో ఉంటుందని చాలా మందే అనుకుని ఉంటారు. ఈ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే అలా ఎదురు చూసే వారిని కాస్త డిస్సపాయింట్ చేసింది ఈ తాజా నామినేషన్ ఎపిసోడ్!

కంటెంట్ ఇచ్చేందుకే కొందరి ప్రయత్నాలు.. అర్థం పర్థంలేని రీజన్స్‌తో మరికొందరి నామినేషన్ ఓట్లు.. అరుస్తూ.. హంగామా చేస్తూ.. డ్రామాలే ప్రియారిటీగా పెట్టకున్న ఇంకొంత మంది ఇంటి సభ్యలు.. వెరసి ఈ సారి జరిగిన నామినేషన్ ఎపిసోడ్ సగటు బిగ్ బాస్ అభిమానిని కాస్త డిస్సపాయింట్ చేస్తుంది. అంతేకాదు కొందరి కంటెస్టెంట్స్ తీరుతో.. తలనొప్పి కూడా పక్కాగా వస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 16th ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం అవ్వడమే.. షకీలమ్మ ఎలిమినేషన్ అయిందన్న బాధతో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ.. ఆ మరుసటి రోజు.. మహేష్‌ దూకుడు సినిమాలోని టైటిల్ సాంగ్‌తో.. నిద్రలేస్తారు. వచ్చీరాని తమ డ్యాన్స్‌ స్కిల్స్‌తో.. లాన్ ఏరియాను షేక్ చేస్తారు. ఇక తరువాత నామినేషన్స్‌లో ఎవరిని ఎవరు నామినేట్ చేయాలనే పాయింట్స్ ఆలోచించుకుంటూ.. ఎవరికి వారు బిజీ అయిపోతారు.

ఇక ఈక్రమంలోనే షకీలమ్మ ప్రిన్స్ నామినేషన్ వల్లే ఎలిమినేట్ అయిందని ఫీలైన దామిని.. ప్రిన్స్‌తో ఎపిసోడ్‌ స్టార్టింగ్‌లోనే గొడవకు దిగుతుంది. ఇక దానికి హర్ట్ అయిన ప్రిన్స్ దామినినే నామినేట్ చేయాని ఫిక్స్ అవుతాడు. సుబ్బును కూడా దామనిని నామినేట్ చేసేందుకు ఒప్పిస్తాడు.

ఇక ఈ సీన్ తరువాత సీదా నామినేష్స్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్.. నామినేట్ చేయాలనుకుంటున్న సభ్యులను టార్గెట్ బోర్డ్ వెనక నిలబెట్టి.. వారి ఫేస్‌ పై ఫోమ్‌ను స్ప్రే చేయాలని కంటెస్టెంట్స్ అందరికీ చెబుతాడు.అయితే ఇప్పటికే కన్ఫర్డ్మ్‌ సభ్యులుగా నిరూపించుకున్న సందీప్ , శివాజీలను ఎవరూ నామినేట్ చేయలేరంటూ పేర్కొంటారు.

ఇక ప్రియాంకతో మొదలైన నామినేషన్స్ ప్రక్రియలో.. ప్రియాంక ప్రిన్స్‌ను.. గౌతమ్‌ను నామినేట్ చేస్తుంది. ప్రిన్స్‌ నామినేట్ చేసినందుకు చెప్పిన రీజన్‌ పర్లేదనిపించినా.. గౌతమ్‌ను ఇంట్లో పనే చేయలేదంటూ.. నామినేట్ చేయడం ఎందుకో కాస్త సిల్లీగా అనిపిస్తుంది చూసిన వారందరికీ..

ఆ తరువాత నామినేషన్ ప్రక్రియకు వచ్చిన రైతు బిడ్డ ప్రశాంత్.. మొదటగా తేజును నామినేట్ చేస్తాడు. అందుకు ‘నేను తొడ కొట్టినందుకు నువ్వు ఫీలవడం నాకు నచ్చలే’ అంటూ రీజన్‌ చెబుతాడు. అయితే రైతు బిడ్డ చెప్పిన రీజన్ నచ్చని బిగ్ బాస్ కాస్త సీరియస్ అవుతాడు. సరైన రీజన్‌ చెప్పమంటూ.. రైతు బిడ్డను ఆదేశిస్తాడు. ఆ తరువాత చెప్పిన రీజన్ కూడా ఏదో బెడ్డుపై పడుకోవడం.. కింద పడుకోవడం అంటూ చెప్పడంతో.. హౌస్‌లో ఉన్న లేడీస్ కూడా.. రైతు బిడ్డ రీజన్స్‌ను డినై చేస్తారు. కానీ రైతు బిడ్డ ఆవేశంతో ఊగిపోవడంతో.. చేసేదేం లేక ‘నువ్వు చెప్పేది కరెక్టే.. వెళ్లి గమ్మున ఓటు వేయ్‌ పో’ అంటూ.. మనోన్ని కూల్ చేస్తారు. ఇక తన సెకండ్ నామినేషన్‌గా దామినిని నామినేట్ చేస్తాడు రైతు బిడ్డ. అయితే దామిని కంట చేసేటప్పుడు ఉఫ్‌ అని తనని చూసే అందని అది కూడా తాను దామినిని నామినేట్ చేసేందుకు కారణం అంటూ.. తన నామినేషన్స్‌ను ఫినిష్ చేస్తాడు.

తరువాత వచ్చిన కార్తీక దీపం శోభ.. రోటీ చేస్తున్నావ్ కానీ.. గిన్నెలు కడగడం లేదంటూ.. సుబ్బును నామినేట్ చేస్తుంది. అయితే ఈ రీజన్‌ను యాక్సెప్ట్ చేయని సుబ్బు.. అక్కడే నిలుచుని ఉండడంతో.. శివాజీని మధ్యవర్తిగా ఉండి.. శోభ, సుబ్బులో ఎవరు కరెక్టో చెప్పాల్సిందా ఆదేశిస్తాడు. అయితే శివాజీ శోభది సరైన రీజన్ అని చెప్పడంతో.. నామినేష్ ప్రక్రియ సాగుతుంది. ఇక తన సెకండ్‌ నామినేషనెట్ కంటెస్టెంట్‌గా రితికను ఎన్నుకుంటుంది శోభ.

నామినేట్ చేసేందుకు తరువాత వచ్చిన అమర్‌.. గౌతమ్‌ను, సుబ్బును.. ఇంట్లో ఎక్కువగా పని చేయడంలేదనే సిల్లీ రీజన్‌తో నామినేట్ చేస్తాడు. ఎందుకో తన రీజన్స్‌తో హౌస్‌లో ఉన్న వాళ్లను కాదుకానీ.. బిగ్ బాస్ చూసే వాళ్లను డిస్సపాయింట్ చేసినట్టు అనిపిస్తాడు. అయితే తనను నామినేట్ ఎందుకు చేశావ్ అని సుబ్బు,అమర్‌ను అడిగితే.. నామినేట్ చేయకుంటే హగ్గు ఇస్తావ్.. చేస్తే ఇలా నిలదీస్తావా అంటూ.. నవ్వుకుంగా అక్కడి నుంచి జారుకుంటాడు.

ఇక ఆ తరువాత నామినేట్ చేసేందుకు వచ్చిన రితిక.. తన ఫస్ట్ నామినేషన్‌గా సుబ్బును ఎంచుకుంటుంది. ఈ ఎపిసోడ్‌లో అందరూ చెప్పినట్టే.. ఎక్కువ పని చేయడం లేదంటూ.. రీజన్ చెబుతుంది. కప్పులు కడగడం లేదు.. ఇది కూడా సుబ్బును నామినేట్ చేయడానికి తనకున్న బలమైన రీజన్‌ అంటూ.. చెబుతుంది సుబ్బు. దాంతో పాటే.. సేఫ్ గేమ్ ఆడుతున్నాయి.. బ్లా.. బ్లా.. అంటూ.. గట్టిగానే సుబ్బుపై మాటల దాడి చేసింది రితిక. ఇక తన సెకండ్ నామినేటెడ్ పర్సన్‌గా గౌతమ్‌ను ఎన్నుకుంటున్న రతిక మరో సిల్లీ రీజన్ చెబుతుంది. ‘నన్ను హాట్ వాటర్ తెమ్మని చెప్పావ్ ..అలా నాకు ఆర్దర్ ఇవ్వడం నచ్చలే’ అంటూ రీజన్‌గా చెబుతంది. కానీ రితిక కోసం తను చేసిన సాయాలు.. చేసిన పనులు చెప్పడంతో.. మాటదాటేసి.. గౌతమ్ ఫేస్‌పై ఫోమ్ స్ప్రే చేసి వెళ్లిపోతుంది.

ఇక ఆ తరువాత నామినేట్ చేసేందుకు వచ్చిన తేజు.. తనను నామినేట్ చేసిన రైతు బిడ్డనే తాను కూడా నామినేట్ చేస్తాడు.వీళ్లద్దరూ.. నాన్ సింక్‌లో మాట్లడుతూ. బిగ్ బాస్ ప్రేక్షకులను కాస్త ఇరిటేట్ చేస్తారు. ఇక ఇంతలో తొడ కొట్టినందుకే తనను నామినేట్ చేశావ్.. అని మళ్లీ రైతు బిడ్డ అనడంతో… ‘నువ్వేందిరా.. నేను నీ తొడ కొడతా’ అంటూ.. రైతు బిడ్డ తొడకొట్టి కాసేపు నవ్విస్తాడు తేజు. ఇక తన సెకండ్ నామినేషన్గా గౌతమ్‌ను నామినేట్ చేస్తాడు తేజు.

ఇక ఆ తరువాత నామినేట్ చేసేందుకు వచ్చిన ప్రిన్స్‌.. తన ఫస్ట్ నామినేషన్‌గా ప్రియాంకను పిలుస్తాడు. ఇక సీదా.. తన యాటిట్యూడ్ అండ్ యాంగ్రీ నేచర్‌తో ఊగిపోతారు. ఇద్దరూ యాటిట్యూబ్ గురించి మాట్లాడుకుంటూ.. బటర్, రోటీ అంటూ.. కిచెన్ మ్యాటర్స్ మొత్తం తిరగేసి.. వస్తారు. ఇక తన సెకండ్ నామినేషనేట్ పర్సన్‌గా దామిని పిక్ చేసుకున్న ప్రిన్స్.. వరుసగా రీజన్స్ చెప్పాడు. దామిని కూడా.. తన రీజన్స్‌ చెబుతా.. పేస్‌పై ఫోమ్ స్ప్రే చేయించుకుని వెళుతుంది.

ఇక ఆ తరువాత ఫుల్ ఫైర్ మీద.. నామినేట్ చేయడానికి వచ్చిన స్టార్ సింగర్ దామిని.. తానేం వంటలక్క కాదు.. తాను హోటల్ రన్ చేయడానికి రాలేదు.. కిచెన్‌లో ప్రిన్స్ కూడా పని చేయాలని చెబుతుంది. ఇక ఆ తరువాత మరో రీజన్‌గా.. మాయాస్త్ర టాస్క్‌లో ప్రిన్స్ డ్రామా అంటూ.. నోరుజారడంతో..ఒక్కసారిగా ప్రిన్స్ తన టెంపర్ కొల్పోతాడు. డ్రామా చేస్తున్నా.. ఆ వర్డ్ తాను తీసుకోను అంటూ.. అరుస్తూ. మళ్లీ రచ్చ రచ్చ చేశాడు. కానీ ఆ తరువాత కంటెంట్స్ ప్రక్రియ ఫినిస్‌ చేయాల్సిందిగా.. ప్రిన్స్‌కు చెప్పడంతో.. తన ఫేస్‌పై దామినితో ఫోమ్ స్ప్రే చేయించుకుంటాడు ప్రిన్స్. ఇక తన సెకండ్ నామినేషన్‌ సుబ్బుకు చేసిన దామిని.. అదే పని చేయడం లేదనే రీజన్‌ చెబుతూ.. తన నామినేష్స్ ఫినిస్‌ చేస్తుంది.

ఇక ఆ తరువాత నామినేషన్‌ సీన్లోకి వచ్చిన గౌతమ్.. రతిక వల్లే సగం ప్రాబ్లమ్స్‌ ఉన్నాయంటూ.. రతిక ఎప్పుడూ నా.. నా.. అంటూనే ఉంటుంది. టీంలో ఉన్నా అంతే అంటూ.. నామినేట్ చేస్తాడు. ఈ క్రమంలో మరోసారి తన మాటలతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఇరిటేట్ చేసే ప్రయత్నాన్ని సక్సెస్‌ ఫుల్గ్ చేస్తుంది. ల్యాగ్‌కే ల్యాగ్‌ అన్న ఫీల్ అందర్లో కనిపిస్తుంది.ఇక ఆ తరువాత తన సెకండ్ నామినేషన్‌గా అమర్‌ను ఎంచుకున్న గౌతమ్.. తనను ఎందుకు నామినేట్ చేశాడో చెప్పిన మాటల్లో ఫెయిల్ అవుతాడు. ఇక అమర్‌ గౌతమ్ చెప్పిన రీజన్‌ను.. సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టినట్టు అనిపిస్తాడు. గౌతమ్ నామినేషన్లో అమర్ కంప్లీట్ డామినేట్ చేస్తుండడంతో.. గౌతమ్‌ను చూస్తూ.. శివాజీ, తేజు, సందీప్ ఆ పక్కనే నవ్వుతుంటారు.

ఇక నామినేషన్ రంగంలోకి వచ్చిన సుబ్బు.. తేజును నామినేట చేస్తుంది. ఇక రీజన్స్ చెబుతూ.. తేజు బాత్రూంకు వెళితే.. వెరీ స్మెల్లీ అని వన్‌ ఆఫ్ ది రీజన్‌ చెబుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇక తన రెండో నామినేటెడ్‌ పర్సన్గా.. ప్రియాంకను ఎన్నుకుంటుంది సుబ్బు. ఈ క్రమంలోనే వీరి మధ్య కాస్త హీటెడ్ డిస్కషన్ నడుస్తుంది.

ఇక సుబ్బుతో.. నామినేషన్స్ కంప్లీట్ అవగా.. బిగ్ బాస్ మరో సారి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పడు నామినేట్ అయిన సుబశ్రీ, గౌతమ్, ప్రియాంక, రతిక, తేజు, దామిని, యావర్ వీళ్లలో.. ఒకరిని నామినేషన్స్ నుంచి బయటికి తీసి.. నామినేషన్స్‌లో లేని ఒకరిని నేరుగా.. నామినేట్ చేయాల్సిందిగా.. కన్ఫర్మ్డ్ ఇంటి సభ్యులైన సందీప్, శివాజీని ఆదేశిస్తాడు బిగ్ బాస్. ఇక పక్కకు వెళ్లి ఆలోచన చేయిన సందీప్ , శివాజీ.. తేజును నామినేషన్స్ నుంచి బయటికి తీసి.. నేరుగా అమర్‌ను నామినేట్ చేస్తారు. అమర్‌ను షాక్ అయ్యేలా చేస్తారు. ఇక ఫైనల్‌గా ఈ వారం నామినేష్స్‌లో ఉంది.. సుబ్బు, గౌతమ్, ప్రియాంక, రతిక, దామిని, యావర్, అమర్‌ అంటూ అనౌన్స్ చేసి.. నేటి ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను ముగించేస్తాడు బిగ్ బాస్.

  – సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?