Shah Rukh Khan- Ram Charan: ప్రధాని మోదీ వేవ్స్ ప్రకటనపై షారుఖ్, రామ్ చరణ్ ప్రశంసలు.. ఎదురుచుస్తున్నామంటూ..

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ క్రియేషన్ హబ్ గా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రకటించిన వేవ్స్ సమ్మిట్ 2025 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు షారుఖ్.

Shah Rukh Khan- Ram Charan: ప్రధాని మోదీ వేవ్స్ ప్రకటనపై షారుఖ్, రామ్ చరణ్ ప్రశంసలు.. ఎదురుచుస్తున్నామంటూ..
Shah Rukh Khan, Ram Charan,
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 1:23 PM

ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు భారతదేశం మొదటిసారిగా ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 (వేవ్స్)ను నిర్వహిస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ ప్రకటన పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. వేవ్స్ సమ్మిట్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. “భారతీయ ఆర్థిక వ్యవస్థలో అది పోషిస్తున్న పాత్రను అలాగే సాఫ్ట్ పవర్‌గా దాని బలాన్ని గుర్తిస్తుంది. మన దేశంలోనే జరగనున్న వేవ్స్ – ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ సమ్మిట్ కోసం నేను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మా పరిశ్రమను జరుపుకునే సందర్భం అన్నింటికంటే, ఛాంపియన్‌లు, సృజనాత్మకతను పెంపొందించే సందర్భం” అంటూ ట్వీట్ చేశారు షారుఖ్.

అంతకు ముందు ప్రధాని మోదీ వేవ్స్ ప్రకటనపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. “ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ ఛేంజర్ కానుంది” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు ఏఎన్నార్ చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. మానవతా విలువలను కూడా ఆయన చాటారని అన్నారు భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. భారత్‌ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాను ఐక్యతా మేళాగా పేర్కొన్నారు మోదీ.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?