Vidaamuyarchi: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న అజిత్.. విదాముయార్చి సినిమా వాయిదా.. ఎందుకంటే..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాము, కోలీవుడ్ హీరో అజిత్ విదాముయార్చి సినిమాలు ఈసారి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ తాజాగా అజిత్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాడు.

Vidaamuyarchi: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న అజిత్.. విదాముయార్చి సినిమా వాయిదా.. ఎందుకంటే..
Vidaamuyarchi Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2025 | 12:54 PM

దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తున్న అజిత్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు షూటింగ్ నుంచి కాస్త విరామం దొరక్కగానే కారు రేసింగ్ లో పాల్గొంటున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గతేడాది వెండితెరపై కనిపించలేదు. తెగింపు సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ మూవీ విదాముయార్చి. డైరెక్టర్ మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. అర్జున్, రెజీనా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమంటూ చిత్రయూనిట్ షాకిచ్చింది. విదాముయార్చి సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

“విదాముయార్చి సినిమాను కొన్ని అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీంతో అజిత్ అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీం అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో సంక్రాంతికి అజిత్ నటిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రంలోనూ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు విదాముయార్చి సినిమా వాయిదా పడడంతో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు మేకర్స్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?