AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహించని ట్విస్ట్.. విడాకుల బాటలో సీరియల్ జంట..? అసలు విషయం ఇదే..

సినిమా ఇండస్ట్రీలో విడాకులు కొనసాగుతున్నాయి. చాలా మంది కపుల్స్ విడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సమంత , నాగ చైతన్య విడిపోవడం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే చాలా మంది సెలబ్రెటీలు విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు.

ఊహించని ట్విస్ట్.. విడాకుల బాటలో సీరియల్ జంట..? అసలు విషయం ఇదే..
Amardeep, Tejaswini
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2025 | 8:56 AM

Share

ఇండస్ట్రీలో ఈ ఆమధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని తెలుస్తుంది. సీరియల్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు అమర్ దీప్. సీరియల్స్ లో ప్రధాన పాత్రలు చేస్తూ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోనూ అమర్ దీప్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అమర్ దీప్ నటి తేజస్విని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీరియల్ నటి తేజస్విని గౌడ. ఈ అమ్మడు కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇన్నాళ్లు సంతోషంగా గడిపారు. అయితే ఇప్పుడు ఈ జంట విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

అమర్ దీప్ ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. అలాగే తేజస్విని గౌడ కూడా సీరియల్స్ లో ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇన్నాళ్లు అన్యుణ్యంగా ఉన్న ఈ జంట విడిపోతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. దాంతో అమర్ దీప్ తేజస్విని అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తాము ఎంతో అన్యుణ్యంగా ఉంటున్నాం అని తెలిపారు.

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

తాజాగా తేజస్విని విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. అవన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చింది. భార్యభర్త అన్నాక గొడవలు సహజమన్నారు. అంతమాత్రానా ఎవరూ విడిపోరని వివరించింది. అలాగే అమర్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని.. తన కన్నా నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని తెలిపింది. మేం ఇద్దరం హాయిగా సంతోషంగా ఉన్నాం ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు అని చెప్పుకొచ్చింది. గతంలోనూ ఇలాంటి రూమర్స్ పై అమర్ దీప్ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.