06 January 2026
నా మెరిసే చర్మానికి రహస్యం ఇదే.. మమితా బైజు చెప్పిన సీక్రెట్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
హీరోయిన్ మమితా బైజు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. వరుసగా హిట్స్ అందుకుంటూ ఈ అమ్మడు ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది.
అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే డ్రాగన్ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జన నాయకుడు సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.
అలాగే సూర్య సరసన సూర్య 46 చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా ఇప్పుడిప్పుడే తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది.
తాజాగా తన చర్మ సంరక్షణ సీక్రెట్స్ పంచుకుంది. తాను రోజంతా ఏ పని చేసినప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ముఖం క్లీన్ చేస్తానని తెలిపింది.
ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటానని.. అదే తన చర్మ సంరక్షణ సీక్రెట్ అని తెలిపింది. టాన్ తగ్గించడానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్ రాస్తుందట.
అందం అంటే ఒకరి కళ్లలోకి చూస్తూ ఉండడం, నవ్వుతూ ధైర్యంగా ఉండడం, తానని తాను నమ్ముకోవడం , అందరితో మాట్లాడడం అందానికి రహస్యమట.
అలాగే శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు నిత్యం వ్యాయామం చేస్తుందట. ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడనని.. విభిన్న వర్కవుట్స్ చేస్తునని అంటుంది.
ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మమితా.. సరైన అవకాశం వస్తే తెలుగులోనూ నటించేందుకు రెడీ ఉన్నానని అంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్