AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: బాలీవుడ్‌లో స్పీడ్ పెంచిన సాయి పల్లవి.. ఆ సినిమా సీక్వెల్‌లోనూ

సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Sai Pallavi: బాలీవుడ్‌లో స్పీడ్ పెంచిన సాయి పల్లవి.. ఆ సినిమా సీక్వెల్‌లోనూ
Saipallavi
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2025 | 8:56 AM

Share

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు. ఎలాంటి డిమాండ్‌లు లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

ప్రస్తుతం సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంది ఈ భామ. తమిళ్ లో అమరన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసింది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే అక్కడ బడా సినిమా కు సైన్ చేసింది.

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రామాయణం 2లోనూ సాయి పల్లవి పాత్రప్రధానంగా ఉంటుందని తెలుస్తుంది. దాంతో బాలీవుడ్ లో ఈ చిన్నది రెండు సినిమాలు చేస్తుంది. కాగా రామాయణం తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుండగా.. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందని తెలుస్తుంది. ఇటీవలే రామాయణం మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. మే లో రెండో భాగం షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.