ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..
ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల జోనర్స్ లో సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై భారీ విజయాలను అందుకుంటున్నాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలానే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది ఆ సినిమా.. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కొచ్చాడియాన్: ది లెజెండ్. ఈ సినిమా ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. 2014లో విడుదలైన ఈ సినిమా. సినీ చరిత్రలో తొలి ఫోటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.
ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా విడుదలైంది. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలైన అవతార్, టిన్ టిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఇది భారతీయ సినిమాలో మొదటిసారి. నటులు మోషన్ క్యాప్చర్ సూట్స్ ధరించి నటించారు, వారి కదలికలు 3D యానిమేషన్‌గా మార్చారు. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. దాదాపు రూ.95 కోట్ల నుంచి రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








