AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెలుగులో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. అందమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి విజయాలను అనుకున్నారు. చక్కటి కథ దానికి తగ్గట్టుగా ఎమోషన్స్ ఉండలా సినిమాలు చేస్తూ ఉంటారు మోహన్ కృష్ణ. త్వరలోనే సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ టాలీవుడ్ డైరెక్టర్.

తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్
Indraganti Mohan Krishna
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2025 | 12:57 PM

Share

ఈ మధ్య కాలంలో పలు డాన్స్ షోలు మరీ మితిమీరుతున్నాయి. ఐకానిక్ సాంగ్స్‌కు అర్ధం పర్థం లేకుండా డాన్స్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. ఎమోషనల్ సాంగ్స్ కూడా డాన్స్ పేరుతో కొంతమంది స్టంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇలాంటి డాన్స్ పర్ఫామెన్స్‌లపై , షోలపై ఎన్నో ట్రోల్స్ మీమ్స్ వచ్చాయి. తాజాగా ఓ డాన్స్ షోలో ఐకానిక్ సాంగ్‌ను చెడగొట్టారని మండిపడుతున్నారు నెటిజన్స్. అంతే కాదు ఆ సాంగ్‌కు డాన్స్ బాగా చేశారని ఆభినందించడం కూడా ఇప్పుడు చర్చాంశనీయం అయ్యింది. తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ సాంగ్‌గా నిలిచిన వాటిలో ఆహా నా పెళ్లి అంట సాంగ్ ఒకటి. ఈ పాటలో మహానటి సావిత్రి అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ మాత్రమే కాదు ఆమె అభినయం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది.

ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్

ఇప్పటికీ ఆ సాంగ్ వింటే మహానటి సావిత్రి  హావభావాలు కళ్ళల్లో మెదులుతాయి. అలాంటి సాంగ్‌కు రీసెంట్‌గా ఓ డాన్స్ షోలో అసభ్యకరంగా స్టెప్పులేశారు. పొట్టి డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌తో పాటను చెడగొట్టేశారు. దాంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అంతే కాదు ఆ డాన్స్ షోకు గెస్ట్‌గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ డాన్స్ పై కొత్తగా ఉందంటూ ప్రశంసించారు. దాంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ వివాదం పై దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సారంగపాణి జాతకం అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్

ఈ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా అలాంటి టీవీ షోలకు వెళ్ళినప్పుడు సొంత అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు కష్టపడి డాన్స్ చేస్తే అభినందించాలి. ఆ అమ్మయి నిజంగా చాలా కష్టపడి డాన్స్ చేసింది. కాకపోతే ఆ పాటకు అలాంటి డ్యాన్స్‌ చేయొచ్చా? లేదా.? అనేది చర్చనీయాంశం. ఇక మేము ఇలాంటి షోలో ఒక సందర్భంలో నవ్విన దాన్ని కట్ చేసి మరో సందర్భంలో నవ్వినట్టు ఎడిట్ చేసి చూపిస్తారు. అయితే ఇలా షోలకు వెళ్ళినప్పుడు సభామర్యాద పాటించి వారిని విమర్శించకూడదు. పైగా నాకు బెల్లి డాన్స్ అంటే ఇష్టమే.. కానీ ఆ పాటకు అది సెట్ అవ్వలేదని నాకూ అనిపించింది. కానీ అక్కడ అది చెప్పలేం అన్నారు ఇంద్రగంటి. గతంలోనూ ఇలా కర్మకాలి నవ్వి వివాదంలో ఇరుక్కున్నా అని చెప్పుకొచ్చారు ఇంద్రగంటి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..