AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము విషానికి విరుగుడు.. గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా..? అసలు నిజాలు తెలిస్తే..

డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం.. నోరు లేని మూగజీవాలను హింసిస్తూ.. వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గొర్రె రక్తంతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటూ ప్రచారం.. చేస్తూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా రక్తం తీస్తుంది..

పాము విషానికి విరుగుడు.. గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా..? అసలు నిజాలు తెలిస్తే..
Sheep Blood Blood Selling
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jan 06, 2026 | 5:24 PM

Share

డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం.. నోరు లేని మూగజీవాలను హింసిస్తూ.. వాటి రక్తాన్ని అమ్ముకుంటున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గొర్రె రక్తంతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయంటూ ప్రచారం.. చేస్తూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా రక్తం తీస్తుంది ఈ ముఠా. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి నిజంగా గొర్రె రక్తం దేనికోసం ఉపయోగపడుతుంది? నిపుణులు ఏం అంటున్నారు? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

గొర్రెల నుండి ఎలాంటి నిబంధనలు పాటించకుండా, కనీసం అనస్థీషియా లేకుండా ఇంజెక్షన్ ద్వారా రక్తం లాగడం.. వాటిని హింసిస్తున్న కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని వల్ల మూగజీవాలు ఒకటి రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. పోలీసులతో టీవీ9 దాడిలో 180 రక్తపు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. నిజానికి గొర్రె రక్తంతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ రక్తాన్ని అక్రమంగా తీస్తున్నారు. మరి తీసిన రక్తాన్ని ఏ విధముగా ఉపయోగిస్తున్నారు. అంటే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మెడికల్ పరంగా మైక్రోబయాలజీలో గొర్రె రక్తం చాలా ముఖ్యమైనది. బ్లడ్ అగర్ టెస్ట్ అనే పరీక్షలో షీప్ బ్లడ్ఉపయోగించి మనిషి శరీరంలో ప్రవేశించిన బాక్టీరియా రక్త కణాలను ఎలా నాశనం చేస్తుందో గమనిస్తారు. దానికి అనుగుణంగా మెడిసిన్ రిఫర్ చేస్తారు వైద్యులు. అంటే మనకు ఏ ఇన్ఫెక్షన్ ఉందో ఏ యాంటీబయాటిక్ సరిపోతుందో డాక్టర్లు సరిగ్గా నిర్ణయించగలుగుతారు. దీనితో పాటు యాంటీవెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు అంటే గొర్రెల్లో బలమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది.. విషానికి వ్యతిరేకంగా మంచి యాంటీబాడీలు తయారవుతాయి. అందుకే యాంటీవెనమ్ తయారీలో గొర్రెల రక్తాన్ని ఉపయోగిస్తారు.

యాంటీవెనమ్ పాము విషాన్ని చాలా చిన్న మోతాదులో, గొర్రెలకు ఇస్తారు. దాని తరవాత గొర్రె శరీరం యాంటీబాడీలు తయారు చేస్తుంది. అప్పుడు గొర్రె నుండి ఆ రక్తాన్ని సేకరించి, ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ యాంటీబాడీలను శుద్ధి చేసి యాంటీవెనమ్‌గా తయారు చేస్తారు. ఈ యాంటీవెనమ్ పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడుతుంది అని ఫార్మకాలజిస్ట్, ప్రొఫెసర్ ముజీబ్ అన్నారు.

అయితే మెడికల్‌గా ఇంత ఉపయోగం ఉన్న గొర్రె రక్తాన్ని ఎలా సేకరించాలి? ఎలా భద్రపరచేందుకు నిబంధనలు పాటించాల్సిందే. సేకరించిన రక్తాన్ని చల్లని ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. ప్రత్యేకంగా లేబుల్ చేసిన కంటైనర్లలో రవాణా చేయాలి. ఇంతటి ప్రాసెస్ కి బయోసేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us