నదిని ఎవ్వరూ బంధించలేరు.. సూర్యుడ్ని ఆపలేరు..! ఎమోషనల్ అయిన ఉదయభాను
ఉదయభాను. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను.

సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరమీద రాణిస్తున్న స్టార్ యాంకర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. అలాగే అనసూయ, రష్మీ ఇలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అయితే బుల్లితెర అతిలోక సుందరి పేరుతెచ్చుకున్న యాంకర్ గుర్తుందా.? ఆమె ఎవరో కాదు.. ఉదయభాను. ఈ అందాల యాంకర్‌ను అంత ఈజీగా మర్చిపోలేరు. ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను.
ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆతర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్ గా చేసి పాపులర్ అయ్యింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది ఉదయభాను.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాలో నటించింది ఉదయభాను. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది ఈ చిన్నది. ఇక పెళ్లి తర్వాత ఉదయభాను బుల్లితెర పై కనిపించలేదు. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు ఉదయభాను. ఇటీవలే త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో నటించింది ఉదయభాను. సినిమాలతో పాటు అడపాదడపా యాంకరింగ్ కూడా చేస్తుంది ఉదయభాను. మొన్నామధ్య ఓ ఈవెంట్ లో యాంకరింగ్ లో సిండికేట్ ఏర్పడింది అని షాకింగ్ కామెంట్స్ చేసింది ఉదయభాను. అయితే సుమను ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేసిందకొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంతో రీసెంట్ గా సుమ భర్త రాజీవ్ కనకాల సెటైర్ వేశారు. తిరిగి దీని పై ఉదయభాను కౌంటర్ ఇచ్చింది. 12 ఏళ్ల వయసు నుంచి యాంకరింగ్ చేయడం మొదలుపెట్టాను.. చాలామంది హీరోలతో కలిసి పనిచేశాను. యాంకరింగ్ లో సిండికేట్ అనేది నాకు జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు. నేను కూడా ఉన్నాను కదా.. చిన్న ఏజ్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఈ స్థాయికి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని ఈ స్థాయికి వచ్చా.. చిన్నప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నా.. ఇప్పటికీ జడ్జ్ చేస్తే ఎలా? చాలామంది నాకు అవకాశాలు రాకుండా కుట్ర చేశారు.. ఈవెంట్స్ కు వచ్చి తిరిగివెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. “నదిని ఎవ్వరూ బంధించలేరు.. సూర్యుడ్ని ఆపలేరు. మధ్యలో గ్రహణం పట్టినా.. సూర్యుడు వెలుగులోకి రావాల్సిందే. నేను కూడా అలానే ఉదయిస్తా అని ఉదయభాను అన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







