Tollywood:14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ.. డ్యాన్స్ రాదని పారిపోయిన హీరోయిన్.. చివరకు చిరంజీవి ఏం చేశారంటే..

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న తారలు.. ఆ తర్వాత వయసు దృష్ట్యా సినిమాల్లో తల్లిగా, అత్తగా, వదిన పాత్రలు పోషిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేసి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో పూర్ణిమ ఒకరు.

Tollywood:14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ.. డ్యాన్స్ రాదని పారిపోయిన హీరోయిన్.. చివరకు చిరంజీవి ఏం చేశారంటే..
Poornima
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 14, 2024 | 8:23 AM

అలనాటి అందాల తార పూర్ణిమ.. ఈ పేరు చెప్పగానే.. “మనసా తుళ్ళిపడకే..అతిగా ఆశపడకే..”, ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు’ అంటూ సూపర్ హిట్స్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. చంద్రబింబం లాంటి ముఖం.. చూడచక్కని రూపం… కలువల్లాంటి కళ్లు..అంతకు మించి అద్భుతమైన నటనతో ఒకప్పుడు వెండితెరపై మాయ చేసింది పూర్ణిమ. 80వ దశకంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. సీనియర్ నటుడు నరేష్ తో కలిసి శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో నటించింది. ఈ మూవీతోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జోడిగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో నటించింది. తెలుగు సినీరంగంలో ఎన్నో చిత్రాల్లో నటించిన పూర్ణిమ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలను పంచుకుంది.

14 ఏళ్ల వయసులోనే తాను సినీరంగంలోకి అడుగుపెట్టానని.. ముద్ద మందారం మూవీతో కథానాయికగా పరిచయమయ్యానని అన్నారు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ, నరేష్ సరసన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు తన వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే అని చెప్పుకోచ్చింది. ఆ సమయంలో డైరెక్టర్స్ ఏం చెబితే అది చేయాల్సిందే అని.. కానీ తనకు రాదని తెలిపింది. ఒక సినిమా షూటింగ్ లో డాన్స్ సరిగ్గా చేయలేకపోవడంతో డ్యాన్స్ మాస్టర్ తనను తిట్టారని.. దీంతో భయంతో షూటింగ్ నుంచి పారిపోయానని తెలిపింది. ముందు సినిమాలో డాన్స్ లేదని చెప్పి తనను తీసుకున్నారని.. కానీ ఆ తర్వాత డాన్స్ చేయాలని చెప్పడంతో తాను పారిపోయానని.. ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయిని ఏం అనొద్దని చెప్పి షూటింగ్ చేయించారని అప్పటి సంగతులను గుర్తు చేసుకుంది పూర్ణిమ.

సినిమాల్లో డాన్స్ తనకు చిరంజీవి నేర్పించారని.. డాన్స్ అంటే భయపడొద్దని.. సింపుల్ స్టెప్స్ వేసి చూపించి.. ఎంతో ఓపిగ్గా తనకు డాన్స్ నేర్పించారని చెప్పుకొచ్చింది. అప్పట్లో తనను చిరంజీవి పూరి పూరి అని పిలుస్తూ ఏడిపించేవారని.. తాను మాత్రం చిరు అని పిలిచేదాన్ని అని తెలిపింది. ప్రేమలేఖ చిత్రంలోనూ తనకు సరిగ్గా డాన్స్ రాలేదని.. దీంతో చాలాసార్లు తిట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.