AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరె ఏంట్రా ఇది.. బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ హాట్ బ్యూటీ.. షాకవుతున్న ఫ్యాన్స్..

సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది. త్రోబ్యాక్ ఫోటోస్, పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. కానీ తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇన్నాళ్లు నెట్టింట గ్లామర్ ఫోజులతో సంచలనం సృష్టించిన ఆ వయ్యారిని ఇప్పుడు ఇలా బామ్మ గెటప్ లో చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: అరె ఏంట్రా ఇది.. బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ హాట్ బ్యూటీ.. షాకవుతున్న ఫ్యాన్స్..
Ashu Reddy
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 7:41 AM

Share

పైన ఫోటోను చూశారు కదా.. అందులో బామ్మా గెటప్ లో కనిపిస్తున్న ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. దీంతో ఆ అమ్మడుకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బుల్లితెరపై ఈ రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేసే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఉన్నట్లుండి బామ్మా గెటప్ ఫోటోస్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదండి. బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోస్ ద్వారా చాలా పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి అక్కడ తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా మారింది. పలు టీవీ షోలలో పాల్గొంటూ చాలా బిజీ అయ్యింది. అంతేకాకుండా డైరెక్టర్ ఆర్జీవీతో అషురెడ్డి ఇంటర్వ్యూ నెట్టింట సెన్సెషన్ అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ఫోటోషూట్స్ చేయడంతో అషు రెడ్డి చాలా ఫేమస్ అయిపోయింది. అయితే ఎప్పుడూ గ్లామర్ టచ్ ఇచ్చే అషూ రెడ్డి ఇలా బామ్మా గెటప్ ఫోటోస్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ అవాక్కాయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటుంది అషూ రెడ్డి. అయితే తాజాగా ఈ బ్యూటీ ఫ్యామిలీ స్టార్ అనే షోలో చేస్తుంది. ఆ షో కోసమే ఇలా బామ్మా గెటప్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అషూ రెడ్డి ఫోటోస్ వైరలవుతున్నాయి. అషూరెడ్డి తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంది. అనాథ పిల్లలను ఆమె చదివిస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనాథ పిల్లలకు అండగా ఉంటుంది.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.