Khushbu: ఎయిర్‏పోర్ట్ అధికారుల పనితీరుపై ఖుష్భూ అసహనం.. ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఇండియాకు సూటి ప్రశ్న..

తనకు కలిగి అసౌకర్యాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. ఎయిర్ ఇండియా సంస్థను సూటిగా ప్రశ్నించింది. దీంతో ఆమెకు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

Khushbu: ఎయిర్‏పోర్ట్ అధికారుల పనితీరుపై ఖుష్భూ అసహనం.. ట్విట్టర్ వేదికగా ఎయిర్ ఇండియాకు సూటి ప్రశ్న..
Khushbu
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2023 | 5:16 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లలో ఖుష్భూ ఒకరు. అగ్రహీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణిస్తుంది. వెండితెరపై…బుల్లితెరపై.. రాజకీయ రంగాల్లో బిజీ బిజీగా గడపిస్తుంది. ఇటీవలే ఆమె కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. నడిచేందుకు వీలుకాకపోయినా.. తన ప్రయాణం మాత్రం ఆగదంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక ముందుగా చెప్పినట్లుగానే మంగళవారం ఉదయం ఖుష్భూ వేరే రాష్ట్రానికి వెళ్లడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే కాలికి గాయంతో వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె ఎయిర్ ఇండియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కలిగి అసౌకర్యాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.. ఎయిర్ ఇండియా సంస్థను సూటిగా ప్రశ్నించింది. దీంతో ఆమెకు ఎయిర్ సంస్థ క్షమాపణలు తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న ఖుష్భూ కాలికి గాయంతోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. నడిచేందుకు వీలుకాకపోవడంతో.. ఆక్కడే ఉన్న అధికారులను వీల్ చైర్ కావాలని అడిగారు. అందుకు తనను 30 నిమిషాలు వెయిట్ చేయించారని.. ఆ తర్వాత వేరే విమానయాన సంస్థ వద్ద నుంచి తెచ్చిన వీల్ చైర్ లో తనను పంపించారని అన్నారు. దాదాపు అరగంట పాటు కాలు నొప్పిని భరిస్తూనే నిల్చున్నానని.. ఎయిర్ ఇండియా సంస్థకు ఒక వీల్ చైర్ ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత కూడా లేదా అంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు ఖుష్భూ.

ఇవి కూడా చదవండి

ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. కాగా ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. జరిగిన పొరపాటుకు ట్విట్టర్ వేదికగా ఖుష్భూకు క్షమాపణ తెలిపింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం అని తెలిపింది. ఇటీవల హీరో సిద్ధార్థ్ సైతం ఎయిర్ పోర్ట్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.