Samantha: సమంత సినిమాకు షారుఖ్ ఖాన్ సక్సెస్ దెబ్బ.. శాకుంతలం మళ్లీ వాయిదా పడ్డట్టేనా ?.
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.
ప్రస్తుతం సమంత చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యశోద సినిమాతో మరోసారి మెప్పించిన సామ్.. ఇప్పుడు శాకుంతలం చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతుంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేసే పనిలో పడ్డారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఫిల్మ్ సర్కిల్లో చర్చలు మాత్రం నడుస్తున్నాయి. తెలుగుతోపాటు.. తమిళం, హిందీలోనూ రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు మరోసారి ఈ మూవీ వాయిదాకు సంబంధించిన వార్తలతో సామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన నటించిన పఠాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇప్పుడు ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు వస్తోన్న భారీ ఆదరణ సమయంలో శాకుంతలం హిందీ వెర్షన్ విడుదల సరికాదని భావిస్తన్నారట నిర్మాతలు.
అందుకే ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా.. మరికొన్ని రోజుల తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారట. మరీ చూడాలి ఈ సినిమాను నిజంగానే మరోసారి వాయిదా వేయనున్నారా ? లేదా ? అనేది. ఒకవేళ ఈ సినిమాను వాయిదా వేస్తే.. వచ్చే నెల మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నారని టాక్ విపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం సామ్.. సిటాడెల్, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది.