Satyadev : ఓటీటీలో సత్తా చాటుతోన్న వర్సటైల్ యాక్టర్.. ‘గాడ్సే’ కూడా ఓటీటీలోకి.. ఎప్పుడంటే

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సత్యదేవ్(Satyadev ). వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

Satyadev : ఓటీటీలో సత్తా చాటుతోన్న వర్సటైల్ యాక్టర్.. 'గాడ్సే' కూడా ఓటీటీలోకి.. ఎప్పుడంటే
Satyadev
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2022 | 8:50 AM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సత్యదేవ్(Satyadev ). వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సత్యదేవ్. ఇటీవలే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీనే కాకుండా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. డైరెక్టర్ వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం కృష్ణమ్మ. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన సత్య దేవ్ ఓటీటీల్లోనూ తన సత్తా  చాటుతున్నాడు.

అయితే సత్యదేవ్ కు ఎక్కువగా ఓటీటీలే కలిసొస్తున్నాయి అంటున్నారు కొందరు విశ్లేషకులు. సత్యదేవ్ నటించిన ’47 డేస్’ సినిమా ఓటీటీలోనే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘గువ్వ గోరింక’ వంటి సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక ‘తిమ్మరుసు’ ‘స్కై ల్యాబ్’ థియేటర్స్ కంటే ఓటీటీ ల్లోనే ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ‘గాడ్సే సినిమాకూడా త్వరలో అంటే జులై 17న ఓటీటీ(నెట్ ఫ్లిక్స్లో) స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ దక్కే అవకాశం ఉంది. ఇలా వర్సటైల్ యాక్టర్ కు ఓటీటీ బాగానే కలిసొస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.