Radhika- Sarathkumar: భార్య కోసం భర్త.. రాధిక ఎంపీగా గెలవాలని శరత్ కుమార్ పొర్లు దండాలు.. వీడియో

పోటీ చేసిన ప్రధాన అభ్యర్థులతో పాటు సామాన్యులు కూడా ఈ ఫలితాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తమ అభ్యర్థులు గెలవాలని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు చేస్తున్నారు

Radhika- Sarathkumar: భార్య కోసం భర్త.. రాధిక ఎంపీగా  గెలవాలని శరత్ కుమార్  పొర్లు దండాలు.. వీడియో
Radhika, Sarathkumar
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2024 | 7:36 AM

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. పోటీ చేసిన ప్రధాన అభ్యర్థులతో పాటు సామాన్యులు కూడా ఈ ఫలితాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తమ అభ్యర్థులు గెలవాలని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆర్ శరత్ కుమార్ కూడా దేవాలయంలో ప్రదక్షిణలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన తన భార్య రాధిక విజయం సాధించాలని కోరుకుంటూ పొర్లు దండాలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. లోక్ సభ ఎన్నికల్లో విరుద్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రాధికా శరత్ కుమార్. మొదటి విడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరిగింది. మంగళవారం ( జూన్ 4న) ఫలితాల వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు రాధిక శరత్‌కుమార్ దంపతులు.. ఆదివారం రాత్రి తమిళనాడులోని విరుధ్‌నగర్‌లో ఉన్న శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం లోక్ సభ ఎన్నికల్లో తన భార్య గెలవాలని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయ ప్రాంగణంలో అంగ ప్రదక్షిణలు, పొర్లు దండాలు పెట్టారు రాధికా శరత్ కుమార్. రాధికతో పాటు నరేంద్ర మోదీ కూడా ప్రధానిగా గెలవాలని శరత్ కుమార్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భార్య రాధికా, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శరత్ కుమార్ పొర్లు దండాలు పెట్టడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి రాధికా వెన్నంటే ఉన్నారు శరత్ కుమార్. ఆమెతో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి శరత్ కుమార్ కోరుకుంటోన్న విధంగా లోక్ సభ ఎన్నికల్లో రాధిక గెలుస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

వీడియో ఇదిగో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.