Sai Pallavi: సాయి పల్లవిని సత్కరించిన సరళ ఫ్యామిలీ.. ఆనాటి విషాదాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్
దగ్గుబాటి రానా నటించిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.

దగ్గుబాటి రానా(Rana)నటించిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రానా, సాయి పల్లవి ఇద్దరూ నక్సలైట్స్ గా కనిపించి ఆకట్టుకున్నారు. విరాట పర్వం సినిమా ఓ బయోపిక్. సరళ అనే యువతీ కథే విరాట పర్వం. సరళ పాత్రలో సాయి పల్లవి నటన అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. ఇటీవల చూపించిన ఓరుగల్లు వాసులు.! విరాట పర్వం ఆత్మీయసభకు వెళ్లిన సాయి పల్లవికి సరళ అమ్మ సరోజ సారె ఇచ్చారు. సల్లంగా బతుకు అంటూ ఆశీర్వదించారు. తమ బిడ్డ పాత్రలో నటించినందుకు.. ఆమె చరిత్రను, త్యాగాన్ని ప్రపంచానికి చూపించినందుకు కృతజ్ఙతలు చెబుతూనే ఎమోషనల్ అయ్యారు.
ఇక తాజాగా ఖమ్మం లో ఉంటున్న సరళ సోదరి ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ.. కూడా సాయి పల్లవిని మెచ్చుకున్నారు. ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. తన సరళను చూసినట్టే అనిసిస్తుందంటూ.. సాయి పల్లవిని అక్కున చేర్చుకున్నారు. అప్పటి విషాద సంఘటనను మరో సారి గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు. అయితే ఖమ్మం జిల్లాలోని కామంచికల్ గ్రామం తూము భిక్షమయ్య చిన్న కుమార్తెనే సరళ. చిన్నప్పుడే రవన్న భావజాలానికి.. కవిత్వానికి ఆకర్షితులైన ఈమె.. రవన్న పై మనసు పారేసుకుంది. కలిసేందుకు జీవిత భాగస్వామి అయ్యేందుకు.. ఉద్యమంలో పాలు పంచుకునేందుకు అడవుల బాట పట్టింది. కాని చివరకు ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో.. అదే అన్నల చేతికి బలైంది. ఇక ఇప్పుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో.. విరా ట పర్వం సినిమాగా.. సాయి పల్లవి రూపంలో మన మందుకు వచ్చింది. విప్లవ భావోద్వేగాలకు.. వెన్నెల లాంటి స్వచ్చమైన ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది.




మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి




