Sapthagiri: మంచి మనసు చాటుకున్న సప్తగిరి.. ఆపదలో ఉన్న దర్శకుడికి అండగా…
కరోనా మహమ్మారి సామాన్యులు , సెలబ్రేటీలు అనే తేడా లేకుండా అందరి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
Sapthagiri: కరోనా మహమ్మారి సామాన్యులు , సెలబ్రేటీలు అనే తేడా లేకుండా అందరి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మరో కొంతమంది కరోనా తో కన్నుమూశారు కూడా. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్… మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు.
కరోనా కారణంగా ఆపదలో ఉన్న ఓ దర్శకుడికి అండగా నిలిచాడు సప్తగిరి. నంద్యాల రవి అనే దర్శకుడు ఇటీవల కరోనా బారిన పడ్డాడు. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యంతో పాదపడుతున్న ఆయన హాస్పటల్ లో చికిత్సపొందుతున్నారు . అయితే హాస్పటల్ బిల్లు 7 లక్షల వరకు అయ్యిందని తెలుస్తుంది. దర్శకుడి కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేకపోవడంతో నటుడు సప్తగిరి పెద్ద మనసుతో ముందుకు వచ్చి లక్షరూపాయలు ఆర్ధిక సాయం అందించాడని సమాచారం. అంతే కాదు గతంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కు సప్తగిరి 2 లక్షల రూపాయలు సాయం అందించిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న దర్శకుడిని ఆదుకున్న సప్తగిరిపై ప్రజలు ప్రసంశలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :